తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, February 12, 2009

బ్లాగరుల సమావేశ విశేషాలు ఎవరూ వ్రాయలేదేమి?

మొన్న ఆదివారం ఫిబ్రవరి,8 న యూసుఫ్‌గూడ ,కృష్ణకాంత్ పార్కు లో బ్లాగర్ల సమావేశం జరిగిందా? జరిగుంటే ఇంతవరకూ ఎవరూ దాని వివరాలు వ్రాయలేదు ఎందుకని? విశేషాలు చెప్పండి.

3 comments:

 1. అబ్బో..భలేగున్నారే మీరు...ఇక్కడ బే ఏరియాలో రెండువారాల క్రితం దగ్గర దగ్గర 25 మంది దాకా వచ్చిన బ్లాగరుల, రచయితల, పత్రికాధిపతుల తొట్టతొలి సమావేశపు వివరాలే, పోపు జాన్ పాల్ గారు పోయిన తర్వాత పొగలొచ్చే రూములో కూర్చుని, వివరాలతో సెగలు కక్కాల్సిన పెద్దవారు పట్టించుకోవట్లా...కృష్ణకాంతుడు, ఆయన ఉద్యానవన విహారం ఎంత...

  ReplyDelete
 2. అయ్యా! మీకు పది మంది తో కలసి ఏదైనా సంఘ సేవ చేద్దాం తెలుగు బ్లాగుల ద్వారా అని వుంటే మీరే ఒక సమావేశం పెట్టండి.

  పీడిత తాడిత తెలుగు బ్లాగర్ల సంఘం లాంటిది ఏమన్నా పెట్టండి. మనమందరం కలసి ప్రపంచ రూపు ని మార్చేద్దాం అని కంకణం కట్టుకోండి. వీలుంటే కరపత్రాలు, ఇంకాస్త ముందుకు వెళ్ళి టీ షర్టులు. కొన్నాళ్ళు మీరు అనుకున్న పనులు నెరవేరితే దిన పత్రికల్లో మీ సంస్థ గురుంచి పడేలా చేస్కోవడం.

  ఏ సంస్థ ని తీస్కున్నా చేసేది ఇదే గా.

  ఈ రూపేణా కొత్త పరిచయాలు. మీకు వ్యాపారోద్దేశాలు వుంటే అవి కొత్త పరిచయాల ద్వారా, పబ్లిసిటీ ద్వారా బాగా నెరవేరతాయి. లేదన్నా మీ స్వభావం కల మరి కొద్ది మందితో దోస్తీ. కొత్త అవకాశాల గురుంచి తెలుస్తాయి. ఈ మాత్రం దానికి వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు అనుకోవడం దేనికి.

  అవునూ ఇంతకీ తెలుగు ప్రచారం లోకి వచ్చి ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలుగు మ్రుదులాంత వుపకరణాలు వాడటం, ఆంధ్రులంతా తెలుగు సాఫ్ట్వేర్లు వాడటం మొదలుపెడితే వ్యాపారావకాశాలు ఎలా వుంటాయి? నేను ఈ మధ్య దీని గురుంచే ఆలొచిస్తున్నా. విదేశాలకి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అక్కడి కంటే ఎక్కువ సంపాదించచ్చు. డబ్బు తో పాటే వుపాధి అవకాశాలు పెంచచ్చు.

  ReplyDelete
 3. నా వుద్దేశం మీకు సూచన ఇవ్వడమేనండి. నా మాటల్లో వ్యంగ్యం కనపడితే అన్యధా భావించకండి .

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు