తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, June 17, 2010

మంత్రాలకు చింతకాయలు ఎందుకు రాలకూడదు?

ఒక మనిషిని "ఓ మూర్ఖుడా!,నువ్వెందుకూ పనికిరావు" అంటే కృంగిపోవచ్చు లేక అన్నవాడిపై కోప్పడవచ్చు. అప్పటి వరకు అతను ఎంత ఆనందంగా ఉన్నా ఈ మాట అనేసరికి ముఖం అంతా మాడిపోయి,డీలా పడిపోయి ఇంతకు ముందు మనం చూసిన అతను ఇతనేనా అనుకొనేట్లు మారిపోతాడు.

అలానే " మీ అంత మంచివారు ఈ కాలంలో చాలా అరుదండీ!, మీరు చాలా గొప్పవారు" అంటే పొంగిపోతాడు. ఆ పొంగు బయటకు కనపడకపోవచ్చు కాని మనసు ఆనందపడుతుంది.

పైన చెప్పిన రెండు సందర్బాలలోనూ ఏమాత్రం పట్టించుకొనని వారు నూటికో,కోటికో కొందరే ఉంటారు. అంటే ప్రతిస్పందన(Reaction) చూపేవారు నూటికి 95 శాతం పైమాటే.

ఇక్కడ మనం మాట్లాడే మాటలు ఆ వ్యక్తిపై ప్రభావం చూపుతున్నాయి కదా. అంటే మనసున్న ప్రతి మనిషీ మాట్లాడే విధానాన్ని బట్టి అతని స్వభావం, అందుకు తగినట్లు ముఖకవళికలు మారుతాయి కదా. చివరికి జంతువులు కూడా మన మనసు బాగా లేనప్పుడు, మనం కోపంతో గట్టిగా అరుస్తున్నప్పుడు అవి కూడా మన వద్ద ముభావం(Dull) గా ఉంటాయి కదా. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. అంటే మనసు పై మాటల ప్రభావం ఖచ్చితం గా ఉంటుందని అందరికీ తెలుసు.

ఇక అసలు విషయానికి వద్దాం.

నేటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పుణ్యమా అని మొక్కలకు,చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని అలానే మనసు కూడా ఉంటుందని, అవి కూడా తమ భావాలను(ఆనందం లేక బాధలను) వ్యక్తపరుస్తాయని తెలుస్తోంది. మనం పరిహాసం గా మాట్లాడితే ఆ మాటల పౌనఃపున్యము, స్థాయి ఒకలా ఉంటాయి. అలానే సీరియస్ గా మాట్లాడినప్పుడు కూడా ఆ మాటల పౌనఃపున్యము,స్థాయిలు వేరేగా ఉంటాయి. అందరికీ ఈ సైన్సు విషయాలు తెలియకపోవచ్చు. కాని తెలిసినా,తెలియకున్నా జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా.

అంటే ఎలా మాట్లాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయం పై మనకు ఒక అవగాహన(Idea) ఉంటుంది కదా. మరి మనలానే మనసు గల చెట్లపై నిర్ధిష్ట పౌనఃపున్యము, స్థాయి గల మాటలు మాట్లాడితే అవి కాయలు రాల్చనూవచ్చు, లేక చెట్టే పడిపోవనూవచ్చు అనే విషయం పై అనుమానం ఎందుకుండాలి. మంత్రాలంటే ఒక విధివిధానం గల మాటలే కదా.

ఋషులంటే కేవలం ఆధ్యాత్మికవాదులే కాదు కదా, ఏ శాస్త్రంలో నిష్ణాతులైనా వారిని ఋషులనే అంటాము. ఉదాహరణకు కణము అనే భావనను కనిపెట్టిన కణాదున్ని ఋషి అనే అన్నాము. మంత్రాలతో పనులు చేయవచ్చు అని అన్నది ఆ ఋషులే కదా.

మన కాలపు మనుషులకు తెలిసింది పూర్వకాలపు మనుషులకు తెలియకపోవచ్చు, అలానే వారికి తెలిసింది మనకు తెలియకపోవచ్చు. అంతమాత్రాన కేవలం హేతువును లేక తర్కాన్ని పట్టుకొని వారు చెప్పింది అసంభవం,బూటకం అని అనడం ఎంతవరకు సమంజసం? వారు చెప్పిన దానిపై పరిశోధన చేద్దాం. తప్పని ఋజువైతే అప్పుడు బూటకం అందాం. మనం ఏ పరిశోధన చేయకుండా ,ఊరకే పనీపాటాలేని పెద్దలు రచ్చబండ పైనో, చెట్ల క్రిందనో కూర్చొని చెప్పారు, అని అవి బూటకం అని ఎలా అనగలం.

గమనిక: మంత్రాలకు చింతకాయలు రాలడం అనే భావన ను ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను మంత్రాలను నమ్మమనీ చెప్పడం లేదు, అలాగే నమ్మవద్దనీ చెప్పడం లేదు. విశ్వాసం,నమ్మకం ఉన్న వారిని వారి మానాన వారిని వదిలెయ్యండి. పరిశోధనల ఫలితంగా మీరనుకొన్నదే ఋజువైతే కనుక అప్పుడు మాట్లాడవచ్చు. ఏ విషయమైనా మన ఊహకు అందనంత మాత్రాన ఆ విషయంపై అతి తొందరగా ఒక అభిప్రాయానికి రావద్దని మాత్రమే నేను చెప్పదలచుకొన్నది.

7 comments:

 1. sunil jee,its not at all logic but it is pure physics rule called resonance.when u know the frequency of an object,u can destroy it with any type of audiable nd un-audiable external frequencies like verbal/words/tuningforks/muscical instruments etc...jayadev.challa/chennai-17

  ReplyDelete
 2. astroyd,
  you mean resonance can destory objects? Amazing! Which rule of physics says that? I am curious to know.

  ReplyDelete
 3. Well said. చాలా మంచి విషయాలు చెబుతున్నారు సురేష్ గారు. నిజమే మనిషిపై మాటల ప్రభావము చాలా ఉంటుంది. BTW..All your posts are excellent. I have been following them for a while.

  జయదేవ్ చల్లా చెన్నై-17 గారూ!మనలో మనమాట మీ ప్రతిపోస్ట్ వెనకాల ఈ ప్రవర అవసరమంటారా..:)ఇక విషయానికొస్తే రెజొనన్స్ అంటే గుర్తొస్తోంది. ఏ ఇద్దరి మధ్య సయోధ్య కావాలన్నా వారి (మనసుల / భావాల ) మధ్య వేవ్ లెంగ్త్ మాచ్ అవాలి అంటారు. అది నిజమే.మరి ఏ వస్తువునైనా నాశనం చేయొచ్చు అనే విషయం గురించి నాకు క్లారిటీ లేదు..నాకు తెలిసిన ఫిజిక్స్ చాలా తక్కువ..కాని చిన్నప్పుడెప్పుడో .. మెకనస్ గోల్డ్ సినిమాలో క్లైమాక్స్ లో కొండలు విరిగిపడటం అనేది గుర్రాల డెక్కల చప్పుళ్ళ రెజొనన్స్ అని మా పిజిక్స్ టీచర్ ఉదాహరణ ఇచ్చినట్లు గుర్తు. ఇపుడు మీరు అంటున్న వినాశం ఎలాంటిదంటారు..Does the same rule apply in everycase or only physical objects..I'm confused:( Could plz elaborate on this?

  ReplyDelete
 4. మంత్రాలకి చిన్తకాయలా ? అసలు చిన్తకాయలకి మంత్రాలేందుకు ప్రయోగం చెయ్యడము. మంత్రాలూ వున్నాయి చింతకాయలూ వున్నాయి. కొందరు పిచ్చివాళు లేవంటారు . ఎందుకంటె వాళ్ళని వాళ్ళే నమ్మరు కాబట్టి . అనుభవము పాఠాలు నేర్పుతుంది. అవసరము లేని వాళ్ళకి ఏదీ అక్కరలేదు. చిన్నప్పటినించి అన్ని అనుకున్నవి జరిగిపోఎయి అనుకోండి. వారికి దేవుడు అవసరసం రాదు. ప్రతి ప్రయత్నము లోనీ అడ్డులే వచ్చివాడికి దేవుడు కనిపిస్తాడు . గజేంద్ర మోక్షము లో గజేంద్రుడు ముందు స్వసక్తినే నమ్ము కున్నాడు .కాని యింక లాభము లేదు అన్నప్పుడు ఎవ్వనిచేజనించు అని ఆలపించేడు . నా స్వానుభవము లో మంత్ర ప్రయోగము వల్ల గ్రహ శాంతుల వాళ్ళ బాగుపద్దవాళ్ళు చాలా మంది వున్నారు
  నేను నమ్మను అంటే నీ ఖర్మ పో . నమ్మిన వాడికి నమ్మినంత యిది ఎలాటిదంటే మనిషికి అనారోగ్యము వచ్చింది. వొక మామూలు వైద్యుడి వద్దకి వెళ్తే ఆయన వల్ల కాలేదు. వొక స్పెషలిస్టు వద్దకు వెళ్ళేడు . రోగం పోయింది . అలాగే ఈ పని చెయ్యగలిగిన వాళు కొంతమంది మాత్రమే వుంటారు వాల్ల్లని పట్టుకోవడము చాల కష్టము . కొంతమంది ఉనారు ధనము పోతంది కాని పనిజరగదు వాళ్ళని చూసేను మంత్రప్రయోగము వల్ల మంచి చేసిన వాళ్ళని చూసేను

  ReplyDelete
 5. జయదేవ్ చల్లా చెన్నై-17 గారూ cotact kotapati.ravi111@gmail.com

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు