తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, June 15, 2010

ఎప్పటికీ మెకాలేను తిట్టుకుంటూనే ఉందామా? మనం చేసేదేమైనా ఉందా?

మెకాలే అను ఆంగ్లేయుడు మన విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించడంలో అగ్రగణ్యుడని అంటుంటారు. దాని గురించి చర్చ మనకు అనవసరం. మన దురదృష్టమో లేక ప్రారబ్దమో విద్యావ్యవస్థ మారింది. నైతికవిలువల కన్నా మార్కులకే,ర్యాంకులకే ప్రాధాన్యం ఇచ్చే తల్లిదండ్రులే,పెద్దలే ఎక్కువయ్యారు. అందరూ అలానే లేరు కానీ అసలంటూ ఉన్నారని తెలుస్తోంది కదా.

ఇలా ఎందుకంటూ ఉన్నానంటే "ఆట" అనే ఒక TV కార్యక్రమం విషయంలో ఆ పిల్లల తల్లిదండ్రుల వాదన వింటే ఆశ్చర్యం,విస్మయం కగుతుంది. "మాకు లేని బాధ మీకెందుకంటూ?" వారు అన్న మాటలకు జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు విస్తుపోయారు.

మెకాలే పై చర్చ అవసరం లేదు. ఎందుకంటే అతను ఇప్పుడు లేడు. రామాయణం లో శ్రీరాముడు చెప్పినట్లు "ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా కావచ్చు కాని ఆ వ్యక్తి చనిపోవడంతోటే అతని పై శతృత్వాన్ని కూడా మనం చంపేసుకోవాలి". అందుకే వాదన అనవసరం అన్నాను.

జరిగిందేదో జరిగింది, మరి మనం చేసేది ఏంలేదా?

ఇక్కడ విద్యావ్యవస్థ లోని మూల(basic) సమస్యను గురించి చెప్పుకోవాలి."మొక్కై వంగనిది మానై వంగునా" అన్నది మన పెద్దలు చెప్పిన సత్యము.విద్య యొక్క మొదటి లక్ష్యము పిల్లల యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందించడము.తర్వాత నైతికముగా అభివృద్ధి చెందేలా చేయడము అనగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దడము మొదలగునవి వస్తాయి.

ఇక్కడ నిజముగా జరిగిన విషయాన్ని గురించి చూద్దాము."ఒక సారి ఒక మంత్రిగారు మన దేశం నుండి జపాన్ కు పర్యటించడానికి వెళ్ళారు.వారి సాంకేతిక ప్రతిభ మొదలగునవి చూసి ఆశ్చర్యపడి అక్కడి ఒక మంత్రి గారితో "ఏమండీ!పురాణ కాలం నుండీ మన రెండు దేశాలు మంచి మిత్రులు.మీ ప్రజలకున్న తెలివితేటలే భారత ప్రజలకు కూడా ఉన్నాయి కదా.మరి అభివృద్ధి విషయంలో ఇంత తేడా ఎందుకున్నదో చెప్పగలరా?" అన్నారు.

అప్పుడు ఆ జపాన్ మంత్రిగారు "మీరన్నది నిజమే.మనము మంచి మిత్రులమే.ఇంకా చెప్పాలంటే భారతీయులకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము.చాలా వైజ్ఞానిక విషయాలకు మీరే మాకు మార్గదర్శకులు.కాని ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే మా దేశంలో 10 కోట్లమంది "పౌరులు" ఉన్నారు."వ్యక్తులు" లేరు."అని సమాధానం ఇచ్చారు.ఇక్కడ మనం "పౌరులు" మరియు "వ్యక్తులు" మధ్య తేడా గమనించవచ్చు.

జపాన్ వారి విధ్యా విధానంలో విశేషం ఏమిటంటే వారి పిల్లలకు చిన్నపటి నుండే తమ దేశపు గొప్పతనం గురించి వారి సంస్కృతి గొప్పతనం గురించి భోధిస్తారు.వారి దేశపు ప్రఖ్యాత వ్యక్తుల గురించి చెపుతారు.ముఖ్యముగా తమ దేశము భగవంతుని దృష్టిలో ఎంతో ఉన్నతమైనదని అందుకే ప్రపంచములో మొట్టమొదట సూర్యుడు తమ దేశములోనే ఉదయిస్తాడని నూరిపోస్తారు.తద్వారా తమ దేశముపైన అపార గౌరవ విశ్వాసాలు పెంపొందేలా చేస్తారు. తమపైన తమకు విశ్వాసం పెంపొందేలా చేస్తారు.తము మహోన్నత వ్యక్తుల వారసులము అన్న భావన పెంపొందించుకొనేలా చేస్తారు.

తర్వాతే మిగతా విషయాలు అనగా సైన్సు,లెక్కలు మొదలగునవి వస్తాయి.ఇప్పుడు అందరికీ అర్థం అయ్యే ఉంటుంది.జపాన్ వారు అంతగా ఎందుకు అభివృద్ధి చెందారో. కొన్ని విషయాలలో వారూ వెనుకబడి ఉండవచ్చు అన్న విషయం కాని ఇక్కడ ఆ విషయం అప్రస్తుతం అని భావిస్తాను.

మన దేశంలో ఇలాంటి విద్యా విధానాన్ని మనం కలలోనైనా ఊహించగలమా?మన సంస్కృతీసంప్రదాయాలు ఎంత ఉన్నతమైనవో అందరికీ తెలుసు. అవి మాత్రం అసలు చెప్పరు.

ప్రతి దేశపు సంస్కృతిలోనూ కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు, అవి మనకెందుకు? మనం మంచినే పిల్లలకు నేర్పుదాం.
"విద్య యొసగు వినయంబు" అన్న పెద్దలమాట ఎంత వృధాగా పోతోందో మనకు తెలుసు.మన ఇప్పటి విద్యావిధానం పిల్లలను మార్కులు తెచ్చుకొనే యంత్రాలుగా ,ర్యాంకులే పరమావధిగా మారుస్తోంది.ఇక నైతిక,సంస్కార విలువలు ఎలా నేర్పుతాయి?


ఇతర దేశాలవారి నుండి బట్టలు ఎలాంటివి వేసుకోవాలో, ఎలాంటి ఫ్యాషన్ ను అనుకరించాలో నేర్చుకొంటున్నాము కానీ మనకు నిజముగా పనికి వచ్చేది నేర్చుకోవడం లేదు.

8 comments:

 1. So you mean to say ?, if we learn more about our culture and tradition, we would succeed ?
  It is not about just that. Even we have 'pourulu' in our country, not just 'Vyakthulu'. Every one feels good and will proud about their country and we too are.
  I agree that we should change our educational system for faster growth and development of the country. But is not just about teaching tradition and culture.
  if you talking about productivity of Japan, we can achieve that even in India with good governance.

  ReplyDelete
 2. "పిల్లలకు చిన్నపటి నుండే తమ దేశపు గొప్పతనం గురించి వారి సంస్కృతి గొప్పతనం గురించి భోధిస్తారు.వారి దేశపు ప్రఖ్యాత వ్యక్తుల గురించి చెపుతారు.ముఖ్యముగా తమ దేశము భగవంతుని దృష్టిలో ఎంతో ఉన్నతమైనదని అందుకే ప్రపంచములో మొట్టమొదట సూర్యుడు తమ దేశములోనే ఉదయిస్తాడని నూరిపోస్తారు.తద్వారా తమ దేశముపైన అపార గౌరవ విశ్వాసాలు పెంపొందేలా చేస్తారు. తమపైన తమకు విశ్వాసం పెంపొందేలా చేస్తారు.తము మహోన్నత వ్యక్తుల వారసులము అన్న భావన పెంపొందించుకొనేలా చేస్తారు.".

  "తమ దేశపు గొప్ప వ్యక్తుల గొప్పకార్యాలు తెలుసుకొన్నప్పుడు" తాము వారికి వారసులమనే విషయం ఎంతో ఆత్మవిశ్వాసం కల్గజేస్తుందనే విషయమే ఇక్కడ నేను చెప్పదలచుకొన్నది.

  ReplyDelete
 3. Do you think that is missing in India ? It is not.
  We to learned about our scientists,freedom fighters and about everyone in our schools.

  If you see children in India,when they come to 2 or 3rd standard itself, they feel proud and respectful to the country. I saw kids like that.

  Our educational system has to be changed to be more practical in teaching than theoretical.

  ReplyDelete
 4. CAT and IIT-Jee are the toughest entrance exams in the world for graduation and MBA where less than 5% of the applicants are entered into the institutions. That means the students entering into IIT and IIMs are best among all the applicants in the world.
  But IITs are IIMs are not even in the list of top 20 universities or institutions in the world. This is where we should improve our educational system.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు