ఇదేదో హిందుత్వవాదమో మరొకటో అని అపార్థం చేసుకోకండి. సరే విషయానికి వద్దాము.
1.మొదట మన వేదాలను గమనిద్దాము.వేదాలను అనుసరించే ఈ సిద్దాంతాన్ని ఆంగ్లేయులు ప్రతిపాదించారు.కాని వేద పరిబాషలో ఆర్యుడు అనగా గౌరవ వాచకం.ఉత్తమ నడవడిక,మంచి వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు.అంతే కాని ఈ పదాన్ని జాతిని సూచించేదిగా ఎక్కడా వేదాలలో ఉపయోగించలేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలలో వలస విషయం కాని,దండయాత్ర విషయం కాని ఎక్కడా చెప్పబడలేదు.
దస్యుడు అనగా మంచి నడవడికలేని వాడని అర్థము.
వేదాలలో కాని,పురాణేతిహాసాలలో కాని ఆర్యావర్తము లేక ద్రవిడ ప్రదేశం అని ప్రాంతాలను బట్టి మాత్రమే పేర్లు పెట్టడం జరిగింది.
ఇక రావణుడు ద్రావిడుడని,రాముడు ఆర్యుడని అపార్థం చేసుకొన్నారు.అపార్థం అని ఎందుకు అన్నానంటే దీనికి ఋజువుగా వాల్మీకి రామాయణంలో మండోదరి రావణుడిని "ఆర్యపుత్రా" అనే సంబోధిస్తుంది.రామాయణమును పూర్తిగా చదివిన వారెవరైనా ఈ విషయాన్ని చూడవచ్చు.
2.ఆంగ్లేయులు ఎలా ఈ సిద్దాంతానికి పథకం రచించారో కొన్ని ఋజువులు.
అ)1866,ఏప్రిల్ 10 వ తేదీ లండన్ లోని "రాయల్ ఏషియాటిక్ సొసైటీ" రహస్య సమావేశ తీర్మానం
"ఆర్య దండయాత్ర సిద్దాంతం భారతీయుల మనసులలోనికి ఎక్కించాలి.అలగైతేనే వారు బ్రిటిష్‌వారిని పరాయి పాలకులుగా భావించరు.ఎందుకంటే అనాదిగా వారిపై ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు.అందువలన మనపాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు."
(వనరు:Proof of Vedic Culture's global Existence - by Stephen Knapp.page-39)
ఆ)మ్యాక్స్‌ముల్లర్ 1886లో తన భార్యకు వ్రాసిన ఉత్తరం
"నేను ఈ వేదం అనువదించటంలో భారతదేశపు తలరాత "గొప్పగా" మారబోతూ ఉంది.అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.ఈ వేదం(ఋగ్వేదం) వారి మతానికి తల్లివేరు.3000 ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకలించి వేస్తుంది."
(వనరు:The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife,1902,Volume I.page 328)
విశేషం ఏమంటే 1746-1794 మధ్య కలకత్తా లో భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన "విలియం జోన్స్",మ్యాక్స్ ముల్లర్ గార్లే ఈ "ఆర్య" శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
3.ఇక భారతీయుల పరిశోధనలు చూద్దాం.
1946లో అంబేద్కర్ రచించిన "Who were the sudras?" అనే పుస్తకంలో శూద్రులు-ఆర్యులు అని ఒక అద్యాయం రచించాడు.అందులో " పాశ్చాత్యులు సృష్టించిన "ఆర్యజాతి" సిద్దాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు.ఈ సిద్దాంతాన్ని పరిశీలిస్తే లోటుపాట్లు రెండు విధాలు గా కనిపిస్తాయి.అవి ఒకటి ఈ సిద్దాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకొన్న ఊహల నుండి గ్రహించుకొన్న భావనలు గానూ,రెండు.ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ,నిజాలను గుర్తించకుండా మొదటే ఒక సిద్దాంతం అనుకొని దానికి అనుగుణమైన ఋజువులు చూపిస్తున్నట్లు ఉంది"
Secrets of vedas అనే గ్రంథమును అరవిందులు రచించారు.ఇందులో "ఆర్యుల సిద్దాంతం గురించిన హేతువులు,ఋజువులు వేదాలలో అసలు కనిపించవు.అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి అసలు ఎక్కడా లేదు".
4.సైంటిఫిక్ ఋజువులు:
1920లో బయటపడిన "సింధు నాగరికత"తవ్వకాలతో ఆర్యుల దండయాత్ర సిద్దాంతం తప్పని ఋజువైంది.హరప్పా,మొహంజదారో
మొదలైన స్థలాలు,లోతల్ రేవు,వీటి నగర నిర్మాణ రీతులు మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో 10వేల సంవత్సరాలుగా ఉన్నతస్థాయిలో వర్ధిల్లుతున్నది అని ఋజువులు చూపిస్తున్నాయి.బ్రిటిష్‌వారి ప్రకారమే మహాభారతం ఇప్పటికి 5000 సంవత్సరాల క్రిందటిది.మన అందరికి తెలుసు రామాయణం అంతకంటే ముందరిది.ఒక వేళ రామాయణ ప్రామాణికతను ఎవరైనా ప్రశ్నించినా వేదాల ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేదు.వేదాలు మహాభారత కాలం కన్నా ఎంతో ముందని తెలుసు.మరి ఆ వేదాలలోనే "ఆర్య" శబ్దం ఉన్నదనీ తెలుసు.అటువంటిది 'గుర్రాలపై దండెత్తి" ఆర్యులు ద్రావిడులను 3500(క్రీ.పూ 1500 నుండి క్రీ.పూ 100 మధ్య) సంవత్సరాల క్రిందట తరిమికొట్టారన్నది ఏ మాత్రం అర్థం లేనిది.
1980లో ఉపగ్రహాల ద్వారా 'సరస్వతీ' నది ప్రవహించిన ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ ప్రవాహ మార్గం ఖచ్చితంగా సరిపోతోంది. వేద నాగరికత సరస్వతీ నదీ తీరంలో వెలసినది అని వేదాలు మనకు చెబుతున్నాయి.కాని బ్రిటిష్‌వారు ఈ నదిని ఒక ఊహగా,వేదాల సృష్టిగా చిత్రీకరించారు.
ముఖ్య విషయం ఏమిటంటే సైంటిఫిక్ గా కానీ,చారిత్రికంగా కానీ ఆర్యుల దాడి కి సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ లేవు.
ఇక ఉత్తర భారత,దక్షిణ భారత ప్రజల శరీర నిర్మాణం,రంగుల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం హిమాలయాలు ఉండడం వలన అధిక చల్లదనాన్ని కలిగిఉంది.దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వలన వాతావరణం వేడి గా ఉంటుంది.అందువలనే ప్రజల భౌతిక రూపాలలో తేడాలు ఉన్నాయి.ఒకే రాష్ట్రం లో ని ప్రజల ఒకే బాషలో తేడాలు(యాస),ఆచారాలలో తేడాలు ఉన్నప్పుడు విశాల భారతదేశంలో ఆచారవ్యవహారాలలో తేడాలు ఉండడం విషయం కాదు.ఉదాహరణకు తమిళనాడులోనూ,ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలోనూ పెళ్ళికూతురుని ఒక గంపలో కూర్చుండబెట్టి పిలుచుకురావడమనే ఆచారం ఉంది.కాని ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలోనే ఈ ఆచారం లేదు.నేను నివశించే అనంతపురం జిల్లాలో కూడా ఈ ఆచారం లేదు.ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.
ముక్తాయింపు:
వ్యక్తిగత విమర్శలు చేస్తే అవి తొలగిస్తాను. మీ వద్ద గల అధారాలు, అభిప్రాయాలు మాత్రం చెప్పగలరు.