Saturday, November 9, 2013
Thursday, November 7, 2013
చాలా మందికి తెలిసిన ఈ కథ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఈ కథ చాలామంది చదివి ఉండవచ్చు.ఒక నిరుద్యోగి ఒక సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్‌వ్యూకు వెళ్ళాడు. ఆ ఇంటర్‌వ్యూకు రానూ,పోనూ చార్జీలు ఆ సంస్థే ఇస్తుంది. కాని ఇంటర్‌వ్యూ సరిగా చేయలేక పోవడం వలన ఆ నిరుద్యోగి ఆ ఉద్యోగం పొందలేకపోయాడు. బయటకు వచ్చేసాడు.ఇంటర్‌వ్యూలు ముగిసిన తర్వాత ఇంటర్‌వ్యూ బోర్డు చైర్మన్ బయటకు వచ్చాడు.
ఈ నిరుద్యోగి ఇంకా అక్కడే తిరుగుతుండడం చూసి అతను " ఏం బాబూ!నువ్వు ఎంపిక కాలేదు కదా? ఇంకా ఇక్కడే ఎందుకు తిరుగుతున్నావ్?" అన్నాడు.
దానికి ఆ నిరుద్యోగి "సార్! మీరు రానూ,పోనూ చార్జీలు ఇచ్చారు కదా. మీరు ఇచ్చినదాని కన్నా మా ఊరికి చార్జీలు తక్కువే. అందుకే మిగిలిన డబ్బును మీకు తిరిగి ఇద్దామని ఇక్కడే ఉన్నాను." అన్నాడు.
ఆశ్చర్యచకితుడైన ఆ ఇంటర్‌వ్యూ బోర్డు చైర్మన్ " బాబూ! నువ్వు ఉద్యోగం లో చేరవచ్చు. సబ్జెక్ట్‌లో (ఉద్యోగం లో) నీకు నేను సహాయం చేయగలను. నీవు నేర్చుకోగలవు. కానీ నిజాయితీ అనేది ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు. అది నీకు ఉంది. చాలా సంతోషం. మా సంస్థలో చేరు" అన్నారు.
ముందే చెప్పినట్లు ఈ కథ చాలామంది చదివి ఉండవచ్చు.
కానీ ఇది జరిగింది ఎక్కడో తెలియనివారి కోసం ఈ టపా.
ఆ నిజాయితీ గల నిరుద్యోగి పేరు తెలియనందుకు క్షమాపణలు.
ఆ సంస్థ : భారతీయ వైజ్ఞానిక సంస్థ (IISc),బెంగళూరు.
ఆ ఇంటర్‌వ్యూ బోర్డు చైర్మన్ : సర్ సి.వి.రామన్ గారు.
రామన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Wednesday, October 2, 2013
నేను ఆచరించిన తర్వాతే మిగతా వాళ్ళ గురించి బాధపడగలను..
జగద్గురువుల చిన్న కథ:
ఆజ్ఞవల్ల బయలుదేరి వెళ్ళారు. పని పూర్తిచేసుకొని నదిదాటి ఇవతలకి వచ్చారు.ఆ తరువాత మనం అందరం
దాటి వచ్చామా లేదా అని లెక్క పెట్టుకుందాం అనుకున్నారు. లెక్కవేయడం మొదలు పెట్టారు. ఒకడు
తగ్గుతున్నాడు. ఒకడు నదిలో కొట్టుకుపోయాడు అని అనుకున్నారు. ఒకాయన దోవన పోతూ అటుగా
వచ్చాడు. విషయం అతనికి చెప్పారు. ఒరేయ్ ఆ పదో వాడివి నువ్వేరా..నిన్ను ఎందుకు విడిచి పెట్టావు?
నువ్వూ ఆలెక్కలోకి వస్తావురా. అందరూ ఉన్నారు అన్నాడు. ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతివాడూ తనని
మాత్రం విడిచి పెడుతున్నాడు. మైకు ముందు కూర్చొని తనని మాత్రం లెక్క వేసుకోకుండా మిగతా వాళ్ళని
ధర్మం ఆచరించడం లేదు అంటున్నాడు ప్రతివాడూ. అందులో నాపాత్ర కూడా ఉన్నది అని ఎవరూ అనుకోవడం
లేదు. నా మటుకు నేను ధర్మాన్నిఆచరిస్తాను అని ప్రతివాడూ అనుకుంటే ఎలా నశించిపోతుంది? ఒక
రథోత్సవంలో త్రాటిని అందరూ పట్టుకొని నడుపుతున్నారు. నా ఒక్కడివల్ల రథం ముందుకు పోతోందా? అని
ప్రతి ఒక్కడూ అనుకొని రథాన్ని వదిలేస్తే రథం ఎలా కదులుతుంది? అలాగే ధర్మాచరణలో కూడా ప్రతి ఒక్కరి
పాత్ర ఉన్నది. కర్తవ్య లోపం నావల్ల కాకూడదు. తండ్రి ధర్మం ఆచరించకుండా కొడుకును చేయడమంటే
కొడుకు ఎలా చేస్తాడు? అలాగే సమాజం విషయంలో కూడా.
Wednesday, September 25, 2013
చెన్నై మిత్రులు(బ్లాగర్లు లేక చెన్నై లో బంధుమిత్రులు ఉన్నవారు) ఎవరైనా ఉంటే సహాయం చేయగలరు.
మిత్రులారా!
మా అబ్బాయి యతీశ్వర్(వయసు 1.5 సంవత్సరాలు) ఆరోగ్య సమస్య రీత్యా చెన్నై నగరములో 1 నుండి 2 నెలలు ఉండవలసి ఉంది. 4000 నుండి 6000 అద్దెలో మైలాపూరు లేక మందవేలి ప్రాంతాలలో అద్దె ఇల్లు (4 గురు సభ్యులకు) ( 1 నుండి 2 నెలలకు) ఏమైనా ఉంటే చెప్పగలరు. ఈ నెలాఖరులోగా ఈ సహాయం వీలైతే చేయగలరు.
Tuesday, September 24, 2013
ఈశావాస్య ఉపనిషత్తు pdf కావలిస్తే download చేసుకోగలరు.
నా "ఉపనిషత్తులు - మన మహోన్నత విజ్ఞానము" బ్లాగులో వ్రాసిన "ఈశావాస్య ఉపనిషత్తు" pdf కావలిస్తే download చేసుకోగలరు.
link: ఈశావాస్య ఉపనిషత్తు(Ishavasya upanishat)
link: ఈశావాస్య ఉపనిషత్తు(Ishavasya upanishat)
Monday, September 16, 2013
Tuesday, September 3, 2013
ఈ మధ్య నేను చదివిన అత్యద్భుత పుస్తకం పరుసవేది ( The Alchemist)
చాలామంది పాలో కొయిలో వ్రాసిన "The Alchemist" అనే పుస్తకం గురించి వినే ఉంటారు. ఎందరో ఈ పుస్తకం బాగుందని చెప్తుంటే చదవాలని ఈ పుస్తకం కొన్నాను.కానీ చదవలేదు. ఈ మధ్య కినిగె వారి వెబ్సైట్ చూస్తుంటే ఈ పుస్తకం తెలుగు అనువాదం "పరుసవేది" కనిపించింది. వెంటనే అద్దెకు డౌన్‌లోడ్ చేసుకొని చదివాను. చాలాచాలా బాగుంది.
జీవితగమ్యాన్ని చేరుకోవడంలో కష్టనష్టాలు, పరిస్థితులను ఎలా ఉపయోగించుకోవాలి ఇలాంటివి ఒక పాత్రద్వారా రచయిత అద్భుతంగా వివరించాడు.
కొన్ని కాల్పనిక సన్నివేశాల సహాయం తీసుకొన్నా మనలను ఈ పుస్తకం ఏకబిగిన చదివిస్తుంది. కొన్ని వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి.
ఉదాహరణకు
"ఒక నిర్ణయం ధృఢంగా తీసుకోవడం అనేది ఉధృతంగా ప్రవహించే ఏరులోకి దూకడం లాంటిది. అది ఎక్కడకు తీసుకెళ్ళినా మనం సిద్ధంగా ఉండాలి."
"నీకు లేనిదాని గురించి వాగ్దానాలు చేయడం మొదలుపెట్టావంటే దానిని సాధించాలన్న కోరికను కోల్పోతావు".
వీలుంటే ఈ పుస్తకం చదవండి. చాలా బాగుంది.

Wednesday, August 21, 2013
సత్యాన్ని పైకి తీసుకురావడానికి అసత్య సహాయం అవసరమా - జగద్గురు ఆదిశంకర చిత్రం
నిన్న జగద్గురు ఆదిశంకర చిత్రం చూసాను. ఎక్కడా బోరు కొట్టలేదు. ఆదిశంకరుల గురించి తెలుసుకోవాలనుకొనేవారికి ఈ చిత్రం చూస్తే పైపూతగా కొద్దిగా తెలుసుకోవచ్చు. ఆయన ఎందుకై భూమిపైకొచ్చిందీ, ఏం సాధించిందీ తెలుసుకోవచ్చు.
కానీ ఆదిశంకరుల జీవితచరిత్ర తెలిసిఉన్నవారిని మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా బాధపెడుతుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు.
ఒక చారిత్రిక మహాత్ముని గురించి చెప్పాలనుకొన్నప్పుడు అసలు చరిత్ర కు భంగం వాటిల్లకుండా చూడాలి. అంతేకానీ నేనేదో మహత్కార్యం చేస్తున్నాననుకొని ఆ కార్యం నిమిత్తం మనకు ఇష్టమొచ్చింది, సత్యదూరమైనది చేయడం భావ్యం కాదు.
కాటికాపరితో సంభాషణ కానీ, మండనమిశ్రునితో వాదం కానీ ఇంకా అనేక విషయాలు సినిమా చూడడానికి వచ్చినవారికి బాగా అనిపిస్తాయేమో కానీ స్వామివారి చరిత్ర చదివున్నవారికి ఏమాత్రం మింగుడుపడవు.
ఇలా సత్యదూరమైన విషయాలతో సినిమా తీయడం వలన మొదటిసారి ఆదిశంకరుల గురించి తెలుసుకోవాలనుకున్న వారికి తెలిసేది ఏమిటి? వారికి తెలియకుండానే ఇదే ఆదిశంకరుల చరిత్ర అనుకుంటారు. తద్వారా అసలు చరిత్ర కాస్తా తెలుసుకోలేకపోతారు.
కానీ ఆదిశంకరుల గురించి నేటి తరానికి తెలియచెప్పాలన్న దర్శకుడి తాపత్రయం మెచ్చుకోవాలి.
సినిమా చూస్తున్నంతసేపూ మరియు సినిమా అయిపోయినతర్వాత నాకు ఒకటే అనిపిస్తూనే ఉంది " సత్యాన్ని తెలియజెప్పేందుకై అసత్య సహాయం అవసరమా?" అని.

Monday, August 5, 2013
పవర్‌స్టార్ (అంతకు మించి మంచి మనసు ఉన్న)పవన్‌కళ్యాణ్ నోట మా ఊరు "కదిరి" నరసింహుని పాట
"కదిరి" అనే మా ఊరు అనంతపురం జిల్లాలోని ప్రముఖ పట్టణం. మా వైపు చాలా జనాదరణ పొందిన నరసింహస్వామి పాట "బేట్రాయి స్వామి దేవుడా" పాట రీమిక్స్ పవర్‌స్టార్ (అంతకు మించి మంచి మనసు ఉన్న)పవన్‌కళ్యాణ్ గారు ఒక సినిమా కోసం పాడారు. అందుకు వారికి మా కదిరి తరపున కృతజ్ఞతలు.
మా కదిరి గురించి తెలుసుకోవాలంటే క్రింది లింక్ నొక్కండి.
Monday, July 8, 2013
Friday, July 5, 2013
మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగల్ బార్ట్ (Douglas Engelbart)ఆత్మశాంతికై ప్రార్థిద్దాము.
కంప్యూటర్ అంటే తెలిసిన ప్రత ఒక్కరికీ "మౌస్(mouse)" గురించి తెలియకపోవడం అంటూ ఉండదు.
ఇప్పుడంటె లాప్‌టాప్ లు వచ్చి మౌస్ ఉపయోగం తగ్గింది కానీ ఆ మాటకొస్తే లాప్‌టాప్ కు కూడా మౌస్ తగిలించుకొని పనిచేసేవాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు.
ఇప్పుడంటె లాప్‌టాప్ లు వచ్చి మౌస్ ఉపయోగం తగ్గింది కానీ ఆ మాటకొస్తే లాప్‌టాప్ కు కూడా మౌస్ తగిలించుకొని పనిచేసేవాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు.
అసలు మౌసే లేకపోతే కంప్యూటర్ వినియోగం అత్యంత కష్టంగా ఉండేది అనడం అతిశయోక్తి కాదు.
అలాంటి మౌస్ సృష్టికర్త ఐన "డగ్లస్ ఎంగల్ బార్ట్ ((January 30, 1925 – July 2, 2013))" గారు జులై 2వ తేదీన మరణించారు.
అంతేకాక కంప్యూటర్ కు సంబంధించిన hyper Text, GUI(Graphical User Interface) యొక్క ఆవిష్కరణలలో వీరి పాత్ర ఉంది.
వారి ఆత్మశాంతికి భగవంతున్ని ప్రార్థిస్తూ ఇంకా ఇటువంటి శాస్త్రవేత్తలను ప్రపంచానికి ఎంతోమందిని ప్రసాదించాలని భగవంతుని వేడుకుందాము.
Thursday, July 4, 2013
వివేకానందుడు ఏం చేసాడో ఇంకో వివేకానందుడు ఉంటే తెలుసుకోగలడు
ఈ మాటలు ఎవరో అన్నది కాదు, వివేకానందుడే తన చివరి రోజులలో అనుకోవడం బాబూరాం(ప్రేమానంద స్వామి) విన్నాడు.
స్వామి వివేకానంద గురించి మనం ఏమని చెప్పుకోగలం? అసలు మనకు ఏమి తెలుసని.
1.ఉక్కు పరిశ్రమ పితామహుడైన జంషెడ్జీ టాటా కు దిశానిర్దేశం చేసిందెవరు ?
2.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఆచార్యపదవిని సున్నితంగా తిరస్కరించిన వారు ఎవరు?
3.ఆధునిక విద్యుచ్చక్తి శాస్త్రజ్ఞుడైన నికోలా టెస్లా(Nikola Tesla) తన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలలో ఆధ్యాత్మిక సహాయం చేయమని స్వయంగా ఆహ్వానించిన వ్యక్తి ఎవరు?
4.బిల్‌గేట్స్,అన్నాహజారే,ఒబామా,గాంధిజీ,నెహ్రుజీ,సుభాష్‌చంద్రబోస్,సర్వేపల్లి రాదాక్రిష్ణన్,అరవిందయోగి లాంటి గొప్పగొప్ప వ్యక్తుల కే స్పూర్థినిచ్చిన ఆ మహావ్యక్తి ఎవరు?
5.బెంగళూరులోని IISc కు మొట్టమొదటి Director గా ఉండమని టాటాలచే ఆహ్వానింపబడ్డ వ్యక్తి ఎవరు?
6.అడవులలోని వేదాంతాన్ని సమాజంలోనికి తీసుకువచ్చిన వారెవరు?
7.స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అధిక సంఖ్యాకులకి స్పూర్థిప్రదాత ఎవరు?
8.కొడగట్టిన దీపంలా ఉన్న హిందూమత ప్రాభవాన్ని విశ్వ వినువీధులలో నిలబెట్టిన ఘనుడెవరు ?
9.మానవసేవే మాధవసేవ అని గురువుగారైన రామకృష్ణపరమహంస గారి ఉపదేశాన్ని స్వీకరించి విశ్వంలో చాటిన మహానుభావుడెవరు ?
10.మతరహితంగా సర్వసమాజానికీ సేవలు చేస్తున్న రామకృష్ణ సంస్థల స్థాపకుడెవరు ?
11.వంద సంవత్సరాలు దాటినా ఇంకా లక్షలమందికి స్పూర్థిప్రదాతగా వెలుగొందుతున్న ఏకైక మహానుభావుడెవరు ?
12.యువతకు కావలసినవి ఇనుపకండలు, ఉక్కు నరాలు అని తెల్పిన మహానుభావుడు ఎవరు?
ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నని చెప్పుకోవాలి?
వీటన్నిటికీ సమాధానం స్వామి వివేకానంద అని మనకు తెలుసు.
ఆ మహానుభావుడు శివసాయుజ్యం పొంది నేటికి 111 సంవత్సరాలు. స్వామీజీ స్థాపించిన రామకృష్ణ సంస్థలు నేటికీ వివాద రహితంగా సేవలు అందిస్తూనే ఉన్నాయి.
తన సందేశం 1500 సంవత్సరాలకు సరిపడినంత ఇచ్చానని స్వామి వివేకానందుడే స్వయంగా చెప్పారు.
"వివేకానందుడే బ్రతికి ఉంటే ఆ మహాపురుషుడి కాళ్ల దగ్గర ఒక శిష్యపరమాణువుగా కూర్చుని ఉండేవాడిని."
-సుభాష్ చంద్రబోస్
చివరగా స్వామి వివేకానందుడు చెప్పిన ఒక సందేశంతో మనం ఆయనకు నివాళులర్పిద్దాం.
"లేవండి,మేల్కొనండి, గమ్యం చేరువరకూ విశ్రమించకండి".
Monday, July 1, 2013
Saturday, June 29, 2013
Friday, June 28, 2013
నా కొత్త బ్లాగు "భారతీయ మహాయోగులు - భారతమాత ముద్దుబిడ్డలు"
నా కొత్త బ్లాగు "భారతీయ మహాయోగులు - భారతమాత ముద్దుబిడ్డలు".
ఈ బ్లాగులో మన భారత యోగుల, మహర్షుల గురించి సంక్షిప్త చరిత్రలు వ్రాయాలని నా సంకల్పము.
ముఖ్యంగా ఆధునిక కాలానికి చెందిన యోగుల గురించి వ్రాయాలని సంకల్పము.
ఈ బ్లాగులో మన భారత యోగుల, మహర్షుల గురించి సంక్షిప్త చరిత్రలు వ్రాయాలని నా సంకల్పము.
ముఖ్యంగా ఆధునిక కాలానికి చెందిన యోగుల గురించి వ్రాయాలని సంకల్పము.
భగవంతుడి దయ మేరకు వ్రాస్తాను.
Tuesday, June 25, 2013
Monday, June 17, 2013
హమ్మయ్య! ఇన్నాళ్లకు నా HTC Desire X మొబైల్ ఫోను తెలుగు చూపిస్తోంది.
HTC కంపెనీ వాళ్ళు వారి కొత్త మొబైల్ ఫోన్లలో భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తున్నారంటే విని అప్పుడే విడుదలైన HTC Desire X అనే మోడల్ (19,000 రూపాయలు) ఫోన్ ను గత అక్టోబర్ 29 న కొన్నాను.
కాని తీరా చూస్తే అందులో హింది,మరాఠి,తమిళం మరియు బెంగాళి భాషలు మాత్రం కనిపించాయి. మన తెలుగు బ్లాగులు ఓపెన్ చేస్తే అంతా ఖాళీగా దర్శనం ఇచ్చేవి. సర్లే నా ప్రాప్తం ఇంతేలే అనుకొని ఒపెరా బ్రౌజర్ లో మాత్రం తెలుగు చూసుకొని సర్దుకుపోయేవాణ్ణి.
కాని మొన్న జూన్ 10 వ తేదీ జెల్లీబీన్ అనే కొత్త ఆండ్రాయిడ్ వర్షన్ కు update చేసుకొమ్మని HTC నుండి కాల్ వచ్చింది. update అయిన తర్వాత చూస్తే తెలుగుతో పాటు భారతీయ భాషలు అన్నిటికీ సపోర్ట్ ఉంది.
అంతేకాకుండా మన భారతీయభాషలలో మెసేజులు కూడ పంపించుకొనే సౌకర్యం కంపెనీవాడే ఇచ్చాడు.
తెలుగు చూపిస్తున్న చిత్రం చూడండి.
చాలాచాలా ధన్యవాదాలు HTC వారికి.

Thursday, June 6, 2013
Monday, May 27, 2013
పదాలతో ఆడుకోవడం అంటే ఇలా ఆడుకోవాలి....అన్నమయ్య కీర్తన
తెలుగు బాష యొక్క సొగసు,సింగారాలను మనం ఎంతగా కోల్పోతున్నామో ఎందరికి తెలుసు. రామాయణంలోని హనుమంతుని సీతాన్వేషణ ను వర్ణిస్తూ ఉన్నటువంటి ఈ క్రింది అన్నమయ్య కీర్తన వింటూ చదవండి. అప్పుడు తెలుస్తుంది తెలుగు బాష యొక్క సొగసుతనం.
అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్యా ||
రామ నిను బాసి నీరామ నే చూడగ నా
రామమున నిను బాడె రామరామ యనుచు
ఆ మెలుత సీతయని యపుడునే తెలిసి
నీ ముద్ర వుంగరము నే నిచ్చితిని ||
కమలాప్త కులుడ నీకమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారి దూరె
నెమకి యాలేమను నీదేవి యని తెలిసి
అమరంగ నీసేమమటు విన్నవించితిని ||
దశరథాత్మజ నీవు దశశిరుని చంపి, యా-
దశనున్న చెలి గావు దశదిశలు పొగడ
రసికుడ శ్రీ వేంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ||
Thursday, May 23, 2013
మన పని మనం చేసుకోవడానికి మొహమాటం ఎందుకు? (అబ్రహం లింకన్ జీవితపు చిన్న సంఘటన)
అబ్రహం లింకన్ యొక్క మహోన్నతపు వ్యక్తిత్వం మనకు పరిచయమే.వారి జీవితం నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
ఒక చిన్న సంఘటన.
ఒక సారి లింకన్ గారి స్నేహితుడు లింకన్ గారి ఇంటికి వెళ్ళేటప్పటికి లింకన్ గారు తమ బూట్లు పాలిష్ చేసుకుంటున్నారు.
అది చూసి వారి స్నేహితుడు "అదేంటి లింకన్! నీ బూట్లు నువ్వే పాలిష్ చేసుకుంటున్నావ్?" అన్నాడు.
వెంటనే లింకన్ గారు " మరి నువ్వు ఎవరి బూట్లు పాలిష్ చేస్తావ్?" అన్నారు.
లింకన్ మాటల్లోని అంతరార్థం తెలుసుకుని ఆ స్నేహితుడు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకుందాం.
స్వామి వివేకానందులు చెప్పినట్లు " ఒకరి గొప్పతనం వారు చేసిన గొప్ప కార్యాల వలన కాక వారు తమ దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులు ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి ఉంటుంది."
వర్గాలు
మహనీయుల జీవితాలలో మధురఘట్టాలు
Friday, April 26, 2013
ఒక శ్రేయోభిలాషి వ్యాఖ్యగా వ్రాసిన ఒక కవిత
సురేష్ గారు..
మీ వ్యాఖ్యలు/ఉత్తరాలు చదువుతూంటే..
అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్న చద్దన్నం రుచి గుర్తొచ్చినట్లు.... కమ్మగా...
మనకు ఇష్టమైన పాత సినిమాలోంచి ఘంటసాల గారు పాడిన పాట వింటున్నట్లు.. తియ్యగా...
మన ఎలిమెంటరీ స్కూల్లో.. తెలుగు మాష్టారు పాఠం మధ్యలో, ఉదాహరణల కోసం.. చెప్పే చిట్టి కథంత.. మధురంగా...
వేసవి కాలం సెలవుల్లొ వచ్చే.. ఐస్ బండిలోంచి ఇచ్చే.. చిన్న కలర్ ఐస్ ముక్కంత, చల్లగా....
ఉంటాయండి...
నిజంగా.. ఇది ఒక అరుదైన అనుభూతి..
మీరు ఇలాగే కొత్తగా.. మనం (సమాజం) మరిచిపోతున్న పాతదనాన్ని గుర్తు చేస్తూ.. ఉండాలని..
- మీ శ్రేయోభిలాషి

Tuesday, April 2, 2013
ఈ ప్రశ్నకు ఎంతమంది సమాధానం చెప్పగలరు?
పెదవులు, నాలుక అవసరం లేకుండా మనం పలుకగలిగే ఏకైక దేశం పేరు ఏమిటో చెప్పగలరా?
Friday, March 22, 2013
ఈ ఏడు మరియు మూడు తలల పామును చూసి మీ జన్మ ధన్యం చేసుకున్నారా?
ఈ మధ్య ఇంటర్నెట్ లో ప్రచారం అవుతున్న విషయం. ముఖ్యం గా facebook లో.
తిరుమలకు వెళ్ళే దారిలో తుంబురు కోన దగ్గర శివాలయానికి సమీపం లో 7 తలల సర్పము కనిపించింది ....దీనితో అందరు కలియుగ దైవం వేంకటేశ్వరుడు కనిపించాడని....
ఆ దారి లో వెళ్ళే భక్తులంత చూశారు .కానీ అర నిముషం కనపడి మాయమైపోయింది .......
దీన్ని చూసి షేర్ చేసిన వారి జన్మ ధన్యం అవుతుంది ....అని పూజారులు , TTD పండితులు చెప్పారు.
అలాగే మూడు తలల సర్పము కనిపించిందని మరో రాష్ట్రపు పూజారులు చెప్పారు.
అలాగే ఒక తల సర్పము కనిపించిందని ఇంకో రాష్ట్రపు పూజారులు చెప్పారు.
మీరు కూడా ఈ చిత్రాలు చూసి జన్మ ధన్యం చేసుకోండి.
Friday, March 1, 2013
అయ్యో నా పుట్టినరోజు క్యాలెండరులో కనిపించడం లేదెందుకని?
అయ్యో నా పుట్టినరోజు క్యాలెండరులో కనపడ్డం లేదు.
ఏం ఫరవాలేదు, ఫిబ్రవరి 29 రాకున్నా దాని బదులు మార్చ్ 1 వచ్చింది.
కాబట్టి ఈరోజే నా పుట్టినరోజు.
Friday, February 1, 2013
సచిన్‌టెండూల్కర్‌లా భుజాలు ఎగురవేస్తామంటే సరిపోదు....ఆయనలా...?
ఉదాహరణకు గాంధీగారు కొళ్ళాయి గుడ్డ కట్టుకొన్నాడని మనం కూడా అలానే ఉండగలమా? భగవాన్ రమణుల వారు గోచీ గుడ్డ ఒక్కటే పెట్టుకొనే వారని మనం పెట్టుకొంటామా? యోగి వేమన నగ్నంగా ఉండేవాడని మనం కూడా బట్టలు విప్పేసి తిరగగలమా? భగవాన్ రమణులు తన పాదం తప్పుచేసిందని తేనెటీగలు కుడుతున్నా అవి పూర్తిగా కరిచి వెళ్ళిపొయేవరకు తన పాదం కదపలేదు. మనమూ అలానే చేస్తే మన గతి ఏమిటి?
బయటకు కనిపించే వాటిని అనుకరిస్తూ కావలసిన దానిని పట్టించుకోకపోవడం ఎవరికి లాభం? ప్రపంచమంతా భగవంతుడే అని ఊరకే విని ఆ జ్ఞానం నిజంగా లేనివాడు పులి కూడా భగవంతుడే అని పులి ముందు నిల్చోగలడా? బయటకు అంతా దైవమే అంటూ కాలికి ఒక ముల్లు కుచ్చుకొన్న మరుక్షణం "అబ్బా నొప్పి!" అని ఎందుకు అంటున్నారు? అంటే అతడు మాట్లాడే మాట ఒకటి, లోపల ఉంచుకొన్నది ఒకటి.
అబ్దుల్‌కలాం గారి తలకట్టు(Hair style) ను, సచిన్ టెండూల్కర్ భుజాలు ఎగురవేయడాన్ని అనుకరిస్తాము, కాని వారికి తమ పనిపట్ల ఉన్న అంకితభావం, దేశం పట్ల గల ప్రేమను అలవరచుకోవడానికి ప్రయత్నించము.వారు నడిచిన మార్గం, వారు ఆచరించి చూపిన విధానాలు మనం ఆచరిద్దాం. ఒకవేళ మనం కూడా ఆ స్థాయికి ఎదిగితే అప్పుడు మనం ఏం చేయాలో, మన బట్టలు ఎలా వేసుకోవాలో, ఎలా తలదువ్వుకోవాలో మనకే అర్థం అవుతుంది. సరే వారి వేషభాషలు బాగుంటే అనుకరించడానికి అభ్యంతరం లేదు. కాని అలా అనుకరించి మనం వారే అయినట్లు భావించడం(feel అవడం) మనలను మనం మోసం చేసుకోవడమే. అంతేకాని గుడ్డిగా వారిని అనుసరిస్తే మనకు ప్రయోజనం ఏమిటి?
Saturday, January 12, 2013
దిగాలుగా,వట్టిపోయిన జనులతో నిండిన దేశం కాదు, ఇనుపకండలు ఉక్కునరాలతో ఉత్సాహం పరవళ్ళు త్రొక్కే జనులతో కూడిన భారతదేశం నాకు కావాలి.
ఇంతటి గంభీర గర్జన చేసిన వారు ఎవరు? ఇంకెవరు, భారతీయ యువత యొక్క ఆరాధ్య దైవం స్వామి వివేకానంద! ఈ పేరు వినగానే పరవళ్ళు త్రొక్కే ఉత్సాహం కలగని వారు ఉండరంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అంతగా ఉత్సాహం కల్గించే పేరు ఇది.వివేకానందుల భౌతికదేహం పుట్టినరోజు నేడు. భారతదేశం ఈ రోజుని జాతీయ యువదినోత్సవంగా ప్రకటించింది. భౌతికదేహం పుడుతుంది మరియు చస్తుంది. కాని ఆ దేహం మాధ్యమంగా తరతరాలకు తరగని ఉత్సాహజలనిధిని ఇచ్చి వెళ్ళారు వివేకానందుడు. ఆయనే స్వయంగా అన్నట్లు తన సందేశం 1000 సంవత్సరాల వరకు జనుల హృదయాలను మేల్కొలుపుతూనే ఉంటుంది. 1000 ఏం ఖర్మ, 10000 ఏళ్ళు ఐనా మేల్కొల్పుతూనే ఉంటుంది.
భారతజాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచవీధులలో సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన ధీరుడు స్వామి వివేకానంద. వివేకానందులు బ్రతికి ఉన్న రోజులలో మధుమేహం, నిద్రలేమి లాంటి సుమారు 31 ఆరోగ్య సమస్యలతో బాధపడేవారని అంటారు. అటువంటి పరిస్థితులలో కూడా దేశం కోసమే జీవితంలోని ప్రతిక్షణం తపించి పోయిన మహనీయుడు స్వామి. చుట్టూ హంసతూలికాతల్పాలున్నా వాటిపై నిద్రపోకుండా భారతీయ నిరుపేదల జీవితాన్ని గురించి తలచుకొని కటికనేలపై పొర్లుతూ తలగడలు తడిసిపోయేలా కన్నీళ్ళు కార్చిన స్వామికి మనం ఏం ఇచ్చి ఋణం తీర్చుకోగలం?
వారి బోధనలను, వారి సందేశాన్ని అనుసరించి "జీవసేవే దైవసేవ" అను ఆదర్శాన్ని అనుసరించడమే వారికి మనం కొంతలోకొంతైనా తీరుచుకోగల ఋణం.
సత్యం,పవిత్రత,నిస్వార్థత ఈ మూడూ కలిగి ఉన్న వారి వెంట్రుకనైనా ఈ లోకం కదిలింపజాలదు.వీటన్నిటిని మించినది ప్రేమ. వీటిని కల్గిఉన్నవారి విజయాన్ని ఏ శక్తీ ఆపలేదు.
- స్వామి వివేకానంద
Monday, December 10, 2012
అహింస,అహింస అంటున్నారు. నిజం గా అహింస అంటే ఏంటో మనకు తెలుసా?
ప్రస్తుత పరిస్థితులలో మన పెద్దల, ఋషుల మాటలు మనం సరిగా అర్థం చేసుకోలేక తికమకపడుతూ, అర్థం కాకపోతే వారిమాటలు ఉత్త మాటలే అని, ఆచరణ యోగ్యం కాని మాటలు అనుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాం. తద్వారా జీవితపు నిజమైన ఆనందాలను కోల్పోతున్నాము.
మన అందరికీ అహింస అనే భావన తెలుసు అనుకుంటున్నాము. నిజంగా ఎంతమందికి అహింస గురించి సరిగా తెలుసో నాకు తెలియదు కాని నాకు మాత్రం అహింస గురించి తెలుసు అనుకున్నది చాలా ,చాలా తక్కువ మాత్రమే అని తెలుసుకున్నాను.
నేను తెలుసుకున్నది గురుశిష్యుల సంవాదంగా వ్రాస్తున్నాను.
ఒక గురువు,శిష్యుడు ఏదో విషయాన్ని గురించి గంభీరంగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక దోమ ఒకటి శిష్యున్ని కుట్టుతోంది. శిష్యుని దృష్టి ప్రక్కకు మరలుతోంది. ఆ దోమను చంపాలని చేయి పైకెత్తాడు. కాని అహింస గుర్తుకు వచ్చి చంపలేదు. అప్పుడు
గురువు: పని (చంపడం) పూర్తి చెయ్యలేదేం?
శిష్యుడు: గురువు గారూ! మీరు జీవహింసను సమర్థిస్తారా?
గురువు: లేదు. కాని నీ మనసులో ఇప్పటికే చావుదెబ్బ కొట్టావు.
శిష్యుడు: నాకు అర్థం కాలేదు.
గురువు: అహింస అనే విషయంలో మన ఋషుల ఉద్దేశ్యం , చంపాలన్న "కోరిక" ను తొలగించడం. అహింసను పాటించడానికి అక్షరాలా అసౌకర్యంగా ఏర్పాటైంది ఈ ప్రపంచం. మనిషి హానికరమైన జీవుల్నినాశనం చెయ్యకతప్పని పరిస్థితులు వస్తే రావచ్చు. కాని అదేవిధంగా కోపం,ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి మాత్రం రాకూడదు.ఈ ప్రపంచపు గాలిని పీల్చుకునే హక్కు అన్ని జీవరాశులకూ ఉంది.
హింసించాలన్న కోరికను జయించడమే ముఖ్యం.
శిష్యుడు: క్రూర జంతువును చంపడానికి తాను బలి కావడానికి సిద్ధం కావాలా?
గురువు: అక్కర్లేదు. మానవ దేహం అమూల్యమైనది. దైవసాక్షాత్కారానికి కానీ, అన్ని జీవులకు సేవ,సహాయం చేయడానికి కానీ మిగతా జీవులతో పోలిస్తే మానవుడికే ఎక్కువ సదుపాయం కల్పించబడింది.
ఒక వ్యక్తి ఒక జీవిని కానీ, మరే జంతువును కానీ చంపకతప్పని పరిస్థితి వస్తే అతడు స్వల్ప పాపానికి గురి కావాల్సి వస్తుందన్నది నిజమే.కాని నిష్ప్రయోజనంగా మానవ దేహం నాశనం కావడం తీవ్రమైన ధర్మ ఉల్లంఘన క్రిందికే వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి.
Wednesday, November 21, 2012
Tuesday, October 23, 2012
Monday, October 22, 2012
సృష్టి నడవడంలో భగవంతుడు ఒక క్రమబద్ధమైన విధానం ఏర్పరచాడా? (నా (అందరి) అనుభవం)
ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే అందరికీ ఎదురయ్యే అనుభవమే ఒకటి నాక్కూడా ఎదురైంది.
ఒక అయస్కాంతం ఉన్నదనుకోండి. అది తనకు దూరంగా ఉన్నవాటిని అతితక్కువ బలంతో ఆకర్షిస్తూ, ఆ వస్తువులు దగ్గరకు వచ్చేకొద్దీ అత్యంత బలంగా ఆకర్షిస్తుందని. ఇది ఆ అయస్కాంత పదార్థ ధర్మం.
మరి మన నిజ జీవితంలో కూడా మన అందరికీ ఒక అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. అదేమంటే మనం ఫలానాచోటికి(గుడికో లేక మన ఇంటికో,కాలేజుకో,సినిమాకో) వెళ్ళాళనుకోండి. ఆ చోటు దూరం ఉన్నంత వరకు మనం మామూలుగానే వెళుతుంటాము. కానీ చేరవలసిన ప్రదేశానికి దగ్గర అవుతున్నకొద్దీ మన నడకలో వేగం పెరుగుతుంది కదా. దగ్గరయ్యే కొద్దీ ఎంత త్వరగా చేరుకుంటామా అన్నంత వేగంగా నడుస్తాము.ఒక వేళ ఏదైనా వాహనంలో కనుక వెళ్తుంటే దగ్గరయ్యే కొద్దీ మానసికంగా ఆత్రుత చెందుతాము.
ఇక్కడ కంటికి కనిపించే లోహాల విషయంలోనూ, కనిపించని ఒక భౌతికమైన ఆకృతి అంటూ ఏమీలేని మనసుకూ కల ఒకే ధర్మాన్ని కనుక ఆలోచిస్తే ఆశ్చర్యం కల్గుతుంది.
అందుకే నాకు ఈ అనుమానం వచ్చింది. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే అన్నిటికీ మూలమైన ధర్మం,వస్తువు ఏదో ఉందనీ, దాని నుండే అన్నీ ఉత్పన్నమైనాయనీ మనకు లీలగా అనిపిస్తుంది. బహుశా ఆ మూలాన్నే మనం భగంతుడిగా కొలుస్తున్నామనుకుంటున్నాను.

Friday, September 28, 2012
పరమేశ్వరుడి కుటుంబము - జీవవైవిధ్యము
హైదరాబాదులో జరుగుతున్న జీవవైవిధ్య సదస్సు సందర్బముగా గతములో ప్రచురించిన టపా మనకు ఆదర్శము పరమేశ్వరుడి కుటుంబమే ను మళ్ళీ ప్రచురిస్తున్నాను.
మొదట వీరి కుటుంబ సభ్యులను చూద్దాం. శివపార్వతులుకాకవీరికొడుకులైన గణపతి, కుమారస్వామి ఈ కుటుంబ సభ్యులు.సరే, ఇక్కడ ఆ కుటుంబము మనకు ఎలా ఆదర్శమో చూద్దాము.
పరమేశ్వరుడు కేవలం మొలకు చర్మమును మాత్రం ధరించి,శరీరమంతటా విభూతిని ధరించి ఉంటాడు. ఇంత మాత్రమేఆమహాదేవుని వస్త్రాలు, అలంకారాలు. ఇక అమ్మపార్వతీదేవిసర్వాలంకార భూషితయై ఉంటుంది.ఈ సందర్బములో ఒకకుటుంబములోని భర్తతెలుసుకోవలసినవిషయం ఒకటి ఉంది. అదేమిటంటే తన కోసం చిన్నప్పటినుండీతననుఎంతగానోప్రేమించిన తల్లిదండ్రులను, కుటుంబసభ్యులనుతన పుట్టింటినివదిలి వచ్చిన భార్యను ఎలాచూసుకోవాలనేది. భర్త ఎంత కష్టపడిఐనా తన అర్ధాంగిని ఆనందపరచాలి. అంటే భార్యకు నగలుకొనిపెట్టో,ఆస్తులు కూడబెట్టో లేక మంచి బట్టలు ఇచ్చోఆనందపరచమని అర్థం కాదు. పరమేశ్వరుడుఅర్ధనారీశ్వరుడు.అంటే తనలో సగభాగం అమ్మవారికి ఇచ్చాడు. ఆమాటకొస్తే శివుడి నివాసంరాజభవనంకాదు. అది ఒక కొండ మాత్రమే. ఉన్నంతలోనే తనూ,తన భార్య సుఖముగానే ఉన్నారు.
అమ్మవారు ఎంత సర్వాలంకారభూషితయై ఉన్నప్పటికీ అది పరమేశ్వరుని కొరకు మాత్రమే. కావాలంటేతనుకూడానార చీరలను మాత్రమే ధరించి ఉండగలదు. శివుడు లేని పార్వతి ఉండలేదు. అయ్యవారిసంతోషమేఅమ్మవారిసంతోషము.ఈ విషయం మనం దక్షయజ్ఞములో చూడవచ్చు. తన భర్తకుఅవమానం జరిగిందని తనప్రాణాలనే త్యాగంచేసిన మహాసాధ్వి పార్వతీదేవి. ఇది ఒక భార్యతెలుసుకోవలసిన విషయం.
ఇక వీరి కుమారులు వినాయకుడు, కుమారస్వామి బిడ్డలు ఎలా ఉండాలనడానికి మంచి ఉదాహరణ.బిడ్డలకు అమ్మానాన్నలే ప్రపంచమని వారిచుట్టూ ప్రదక్షిణ చేయడమే సర్వతీర్థాలు,సర్వపుణ్యక్షేత్రాలు,అందరు దేవతలూవీటన్నిటినీ దర్శించిన ఫలం కలుగుతుందని వినాయకుడునిరూపించాడు. దీనిని తన తమ్ముడైనకార్తికేయునికిఉదాహరణగా ఒక అన్నగా గణేశుడు చూపించాడు.కార్తికేయుడు కూడా నిజం తెలుసుకొని తన అన్నయొక్కగణాధిపత్యాన్ని (గణాలకు అధిపతి పదవిని)సంతోషముగా అంగీకరించాడు. ఏ విధమైన పోట్లాటా పెట్టుకోలేదు.
ఇక శివపార్వతుల,గణేశకార్తికేయుల ఆభరణాలు,వాహనాల గురించి చూద్దాం.శివుడి ఆభరణాలు పాములు, వాహనం నంది. అమ్మవారి వాహనము సింహము.గణేశుని వాహనము ఎలుక, కుమారస్వామి వాహనము నెమలి.
మనకు తెలుసు సింహము అత్యంత భయంకర జంతువు,మృగరాజు. నెమలి,పాములు పరస్పరశత్రువులు. అలాగేపాములు,ఎలుకలు శత్రువులు.సింహము తన ఆహారముగా ఏ జంతువునైనాతినగలదు. అది ఎద్దు ఐనా, నెమలిఐనాసరే.కాని ఈ కుటుంబములో ఇవేమీ ఒకదానికొకటి హాని తలపెట్టకుండా ఆనందముగామసలుకొంటున్నాయి.
ఇక్కడి జంతువులను మనిషి మనస్తత్వాలుగా చెప్పుకోవచ్చు. ఏ ఇద్దరి మనస్తత్వాలూ ఒకేలా ఉండవు.అలాగేఒకకుటుంబములో కూడా విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. కాని ఎవరూ ఎవరినీబాధపెట్టుకోకుండా, పరస్పరహానికలిగించుకోకుండా అందరూ సంతోషముగా ఉండాలి.
ఓం నమః శివాయఓం జగన్మాతాయ నమఃఓం గం గణపతయే నమఃఓం స్కందాయ నమః
గమనిక : ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇక్కడ నేను శివపార్వతుల కుటుంబాన్నిఒకదైవకుటుంబముగాకాక ఒక సాధారణ కుటుంబముగా మాత్రమే తీసుకొన్నాను. ,
ఎప్పుడైనా శివపార్వతుల కుటుంబము ను గమనించారా?

Thursday, September 27, 2012
Monday, September 24, 2012
"No cell phone Day"(సెల్‌ఫోన్‌రహిత దినము)అని ఒక రోజును జరుపుకుంటే బాగుంటుంది కదా!
ఇవ్వాళ ఎక్కడో సెల్‌ఫోన్ రేడియేషన్ గురించి చదువుతుంటే ఒక ఐడియా వచ్చింది.అదేమంటే mothers day,fathers day,lovers day లాగా No cell phone Day కూడా ప్రభుత్వం నిర్భందంగా విధిస్తే బాగుంటుంది కదా అని.
మరి అత్యవసర సమాచారం ఎలాగా అంటారేమో , ఆ రోజు call rates, sms rates నిమిషానికి 30 రూపాయలో లేక మరో Tariff వసూలు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది.
Wednesday, June 13, 2012
ఇలా చేయడం శ్రీరామానుజాచార్యులకే చెల్లింది.

అష్టాక్షరీ మంత్రాన్ని బహిర్గతం చేసి మానవాళికి మహోపకారం చేసిన రామానుజాచార్యుల జీవిత సంఘటన ఇది.
శ్రీరామానుజాచార్యుల కాలంలో జనులు రోజూ ఒక వింతను చూసేవారు.
అదేంటంటే రామానుజులు శారీరకంగా అంత బలవంతులు కాకపోవడంతో రోజూ స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక బ్రాహ్మణుని భుజంపై చేతులు వేసుకుని వెళ్ళేవారు. స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక శూద్రుని భుజంపై చేతులు వేసి వచ్చేవారు. జనం దీనిని వింతగా చూసేవారు.
ఒక రోజు కొందరు ధైర్యం చేసి స్వామి ప్రవర్తనకు గల కారణం అడిగారు.
అప్పుడు ఆయన ఇలా అన్నారు.
"స్నానం వలన నా శరీరం మాత్రమే శుభ్రం అవుతోంది. మనసులోని మాలిన్యం పోవడం లేదు. ఇతరుల కన్నా నేను గొప్పవాన్ని అనే భావన అహంకారం అనిపించుకుంటుంది. మనిషి పురోగతికి ఆధిక్య భావన అన్నింటికీ మించిన ఆటంకం.స్నానం చేసి దేహ మాలిన్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత నేను శూద్రున్ని తాకి నా అహంకారాన్నీ,మనోమాలిన్యాన్ని తొలగించుకుంటున్నాను. నేను ఎవరికన్నా గొప్పవాణ్ణీ కాను. నాకన్నా ఎవరూ తక్కువ వారూ కాదు. నాకాన్నా శూద్రుడు కూడా శ్రేష్ఠుడే అనే భావన వలన నాకు ఆనందం లభిస్తుంది."
వర్గాలు
మహనీయుల జీవితాలలో మధురఘట్టాలు
Friday, June 1, 2012
వేమనకూ తెలుసు నేటి మానవుల అవసరాలేమిటో!
నేటి ప్రపంచంలో ఎంతో అవసరమైన సమాచార నైపుణ్యాలు(Communication skills),యాజమాన్యనైపుణ్యాలు(Management skills) నాటికాలం లోని వేమన పద్యాలలోనే చూడవచ్చు.
ఇందుకు ఉదాహరణగా కొన్ని పద్యాలు చూడండి.
మాట జెప్ప వినని మనుజుడు మూర్ఖుడు
మాట విన్న నరుడు మానుడగును
మాట వినగ జెప్ప మానుట కూడదు
విశ్వధాభిరామ వినుర వేమ
అర్థము:
ఎదుటివాడు చెప్పిన మాటలలోని మంచిచెడులను తెలుసుకోలేనివాడు మూర్ఖుడు.అందరిమాటలను ఆలకించేవాడు ఉత్తముడు.మాటలు విన్న త్రవత మంచిచెడులను ఆలోచించి సమాధానం చెప్పకపోవడం కూడా సమంజసం కాదు.
పదుగురాడు మాట పాడియై ధర జెల్లు
నొక్కడాడు మాట యెక్కదెందు
వూరకుండువాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ
అర్థం:పదిమంది చెప్పే మాట అబద్దమైనా అదే న్యాయంగా చెల్లుతుంది.ఒక్కడే నిజం చెప్పినా నమ్మరు.వాగ్వివాదాల సమయంలో మౌనంగా ఉండేవాడే ఉత్తముడు.
తామసించి చేయదగదెట్టి కార్యంబు
వేగిరింపనదియు విషమగును
పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనా
విశ్వదాభిరామ వినుర వేమ
అర్థం:ఏ పని ఐనా తొందరపడిచేయుట మంచిది కాదు.తొందరపడడం వలన పని చెడుతుంది.పచ్చికాయ తెచ్చి ముగ్గ పెట్టినంత మాత్రమున అది పండు(ఫలము)కాదు కదా.
శాంతమే జనులను జయమొందించును
శాంతముననె గురువు జాడ తెలియు
శాంతభావ మహిమ జర్చింపలేమయా
విశ్వదాభిరామ వినుర వేమ
అర్థం:శాంతస్వభావం ఉంటెనే ఏదైనా సాధించగలము.శాంతంతోనే గురువులు గొప్పవారయ్యారు.శాంతగుణం మహిమను వర్ణించలేము.
Thursday, May 31, 2012
ఆంజనేయుడొక్కడే ఇలా అర్థం చేసుకోగలడేమో (ఆంజనేయుని అత్యద్భుత జ్ఞానం)
క్రింద ఉదహరించు సంఘటన లంకలో సీతతో రాముని నిందిస్తూ రావణుడు పలికిన మాటలు:
''అతల్పం నిద్రాళుః రజనిషు కువాక దుర్గత తమః
మహాకాతర్యాఢ్యః మనసి విధుత ప్రోజ్జ్వ లయశాః
వధా న్మాంసా దానం బహు విమతలాభో జనకజే.''
అంటే "రాముడు శయ్యలేకుండా రాత్రిపూటనిద్రిస్తాడు. చెడ్డమాటలు పలుకుతాడు, ప్రియమైన హితవాక్యం చెప్పడు, దరిద్రం అనుభవిస్తున్నాడు, అన్నిటి కంటే పిరికివాడు, ఏది చూచినా భయపడువాడు, మాంసం తింటాడు అట్లాంటివాడు, ''కథంశ్లా ఘ్యోరామః'' అటువంటి రాముని నీవు ఎలా పొగడుతున్నావు? అతడు నగరాలు విడిచి అడవుల పాలైనాడు. ఖరదూషణాదులను చంపి పెద్దనష్టం పొందాడు. చివరకు భార్యే కనిపించని నష్టం కలిగింది. అందువల్ల రాముడు శ్లాఘ్యుడుకాడు (అంటే పొగడబడేందుకు అర్హుడు కాదు) - అని రావణుడు చెప్పగా
సీతాదేవి ఇలా బదులు చెప్పింది.
'ఖల తం అసకృత్ మా స్పృశగిరా''
ఓదుర్మార్గుడా! నీ వాక్కుతో ఆ మహానుభావుని ముట్టుకోకు-అంటే అతని నామమైన పలుకుటకు నీకు యోగ్యత లేదని మృదువుగా చెప్పింది.
ఈ సంభాషణను హనుమంతుడు చెట్టు పైనుండి వింటున్నాడు.
అయితే ఆంజనేయస్వామి నవవ్యాకరణవేత్త. ఐంద్రియాదివ్యాకరణాలు తొమ్మిది, ఆయనకు తెలుసు అంతేకాక మహాభక్తుడు, అందువల్ల అమ్మచెప్పిన మాటలోని మరొక విశేషభావాన్ని యిలా గ్రహించాడు.
ఖల అంటే దుర్మార్గుడని అర్థం కనక ఆ పుణ్యపురుషుడైన రాముని గురించి మాట్లాడే అధికారందుర్మార్గుడైన రావణునికి లేదని సీతాదేవి తాత్పర్యం.
''తం''-అంటే ''అతనిని'' అనే అర్థం కాకుండా ''అతల్పం నిద్రాళుః'' అనే శ్లోకంలోని తకారాలన్నింటినీ ఒక్కసారి (అసకృత్)కూడా పలుకకుండా-శ్లోకంలోని తక్కిన మాటల భావాన్ని మాత్రమే గ్రహించాలని ఆ జగన్మాత మాటలోని విశేషముగా హనుమంతుడు గ్రహించాడు. శ్లోకాన్ని ఆ ప్రకారం తిరిగి చదువుకొంటే అమ్మవారు సూచించిన ప్రధానార్థం గోచరిస్తుంది
''మొదటిది-అల్పనిద్రాళుః'' అని వస్తుంది. ''అల్పాహారో, అల్పనిద్రః'' అని రామునిగురించి వాల్మీకి చెప్పిన దానికి యిది సరిపోతుంది, మహాపురుషులు ఎప్పుడు ఏం భుజిస్తారో, ఎక్కడ ఎప్పుడు నిద్రిస్తారో ఎవరికీ తెలియదు, రాములవారు అట్టివారు.
రెండవదానిలో ''తకారాలు'' తీసేస్తే ''కువాక్ దుర్గమః''అని వస్తుంది. అంటే కువాక్కులకు దుర్గముడని అర్థం, వాటికి వారివద్దకు వెళ్ళడానికి కూడా అర్హతలేదు
. తర్వాతమాట- ''మహాకార్యాఢ్యః'' అని వస్తుంది. దేవకార్యనిర్వహణం. దుష్టనిగ్రహం, శిష్టరక్షణం, చెయ్యడం వారి కార్యము అని అర్థం. ''పైమాట ''విధుప్రోజ్జ్వలయశాః'' అని వస్తుంది. అంటే చంద్రకాంతివంటి కీర్తిగలవాడని అర్థం. ''బహువిమలాభః''అనేది అనంతరపదం, ఆయనకాంతి కూడా మిక్కిలి స్వచ్ఛమైనదని అర్థం.
అందుకే అంటారు
"మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి"

Wednesday, May 30, 2012
ఫలితం కోసం వేచిచూసేవాడిని ఫలితం తెలిసికూడా చెప్పకుండా టెన్షన్ పెట్టడం ఒక పైశాచికానందమే!
TV లలో వచ్చే Reality show లలో పోటీదారులను చూస్తుంటే అయ్యోపాపం అనిపిస్తోంది. వాళ్ళు వాళ్ళ పని పూర్తి చేసి ఫలితం కోసం వేచిచూస్తుంటారు. కాని వ్యాఖ్యాత లేక న్యాయనిర్ణేతలు అనబడే సదరు వ్యక్తులు ఫలితము వాళ్ళ చేతులలో ఉంచుకొని పోటీదారులకు చెప్పకుండా వాళ్ళను Tension పెడుతుంటారు.
చూసే ప్రేక్షకులకే చాలా Tension ఉంటుంది. అలాంటిది నిజంగా పోటీలో పాల్గొన్నవారికి ఇంకెంత ఉంటుందో కదా పాపం. వారు ఏడుస్తారు. విసుగుతో (Frustration) తో పక్కవారిని ఈర్ష్యా,అసూయలతో చూస్తుంటారు, బాధపడుతుంటారు. ఇవన్నీ చూస్తూ వ్యాఖ్యాతలు మరియు న్యాయనిర్ణేతలు ఎంతో సంతోషంతో ఇంకా రెచ్చగొడుతుంటారు. పోటీదారుల బాధలలో వీరు ఆనందాన్ని వెదుక్కుంటూంటారు. ఇవన్నీ మనం చూస్తూ Tension పడుతూ ,అయ్యో పాపం అనుకొంటూ తిట్టుకొంటూ ఉంటాము.
వ్యాఖ్యాతల సంగతి సరి, మరి న్యాయనిర్ణేతలు అనబడే సదరు వ్యక్తులు కొద్దోగొప్పో పేరు సంపాదించుకొన్నవారే కదా! వారి బుద్ధి ఏమైంది? వయసుతో పాటు వివేకం సంగతి దేవుడెరుగు, వారికి శాడిజం బాగా పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.
హనుమంతుడు లంకలో సీతమ్మను చూసి వచ్చిన తర్వాత అతని కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వేచిచూస్తున్న వానరవీరులను ఏం Tension పెట్టలేదే. వానరుల దృష్టిలో పడగానే "దృష్ట్వాతు సీతా" (చూసాను సీతను) అన్నాడు కదా. "సీతను చూసాను" అని కూడా అనలేదు, అలా అంటే మొదట సీత పేరు చెబితే సీతమ్మకు ఏమయ్యిందో, చూసాడో లేదో అనే సందేహాలు వస్తాయని మొదటే "చూసాను" అనే పాజిటివ్ మాట అన్నాడు.
మనము హనుమంతునితో మనలను పోల్చుకోనవసరం లేదు, కనీసం అతని ఆచరణ ను తెల్సుకొని మనలను మనం దిద్దుకొంటే చాలు కదా.
కొసమెరుపు:
అసలు TV చూడకుంటే సరిపోతుంది అనుకోవచ్చు. కాని ఇలాంటి కార్యక్రమాలు చూడడం వలన ఇలా మనం మన జీవితంలో ఉండకూడదు అని నేర్చుకోవచ్చేమో. ఇలాంటి భావంతో చూస్తే ఏ తలనొప్పీ ఉండదనుకొంటాను.

Friday, May 25, 2012
ఏమిటయ్యా వేంకటేశు...
ఏమిటయ్యా వేంకటేశు...
అప్పుడెప్పుడో.. ఒక సోమరి ఏనుగు కాలికి దెబ్బతగిలితేనే... ఇంటి దగ్గరినుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి రక్షించావే..
ఆ తరువాత... ఒక వెర్రి పిల్లాడు... పొరపాటున ఒక పిచ్చి రాయిలో నువ్వున్నావని అంటే.. ఏకంగా ఒక అవతారాన్నే చూపించావే...
మరోసారి.. ఒక చాదస్తపు వృద్దురాలు... ఎంగిలి పండ్లిస్తే.. మొహమాటం కూడా లేకుండా తిన్నావే....
మొన్నటికి మొన్న... పాత స్నేహితుడు పలకరింపుకు వచ్చి అటుకులిస్తే... అష్ట ఐశ్వార్యలిచ్చి సత్కరించావే...
మరి నేనిప్పుడు.. అంతులేని కష్టాల్లో, అయోమయమైన రాగద్వేషాల్లో కొట్టుకుంటుంటే కరుణించవేమయ్యా.... ఇంత మొండివాడివేమయ్య ..
--ఇది మా స్నేహితుడు కొండయ్య వ్రాసిన కవిత
--ఇది మా స్నేహితుడు కొండయ్య వ్రాసిన కవిత
Tuesday, May 22, 2012
Wednesday, May 9, 2012
ఈ మధ్య నేను చూసిన మంచి సినిమా "Two brothers"
నా స్నేహితుడు ఉదయ్ చెప్పగా 2004 సంవత్సరం లో విడుదలైన Two brothers అనే పులుల కు సంబంధించిన సినిమా చూశాను. చాలా బాగుంది. ప్రేమాభిమానాలు, మాతృప్రేమ అనేవి సర్వవ్యాపకమని పులుల ద్వారా దర్శకుడు బాగా చెప్పగలిగాడు.తల్లి పులి, దాని ఇద్దరు బిడ్డలైన రెండు పిల్లలు మానవ స్వార్థం వలన విడిపోవడం తర్వాత ఎన్నో కష్టాలు పడడం చివరికి మూడూ కలవడం ఎంతో బాగా చూపించారు. ముఖ్యంగా పులులు మధ్య భావోద్వేగాలను దర్శకుడు చాలా బాగా చూపించాడు. కొన్ని దృశ్యాలలో మనము కూడా ఆ భావోద్వేగంలో లీనమైపోతాము. అంతబాగా తీశారు.
సెంటిమెంట్ కు పెద్దపీట వేస్తూ తీశిన ఈ ఆంగ్ల చిత్రం చాలా కదిలించింది.
మన తెలుగు మూసచిత్రాలకు భిన్నంగా మంచి సినిమా చూడాలనే కోరిక ఈ సినిమా ద్వారా తీరింది.
ఈ చిత్రం ఫ్రెంచ్ నుండి ఆంగ్లానికి అనువదించినట్లు ఉంది.
Wednesday, April 25, 2012
అన్నమయ్య ఆవేదన అర్థం చేసుకోండి
కీర్తన:
కడుపెంత తా గుడుచు కుడుపెంత! దీనికై పడని పాట్లనెల్ల పడి పొరలనేలా||
పరుల మనసునకునాపదలు కలుగజేయ పరితాపకరమైన బ్రతుకేలా|
సొరిదినితరుల మేలుచూచి సైపగలేక తిరుగుచుండేటి కష్టదేహమిది యేలా||
యెదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు చదివిచెప్పని యట్టి చదువులేలా|
పొదిగొన్న ఆశలో బుంగుడై సతతంబు సతమతంబై పడయు చవులు దనకేలా||
శ్రీవేంకటేశ్వరుని సేవానిరతిగాక జీవనభ్రాంతి బడు సిరులేలా|
దేవోత్తముని నాత్మ దెలియ నొల్లక పెక్కు త్రోవలేగిన దేహి దొరతనంబేలా||
అర్థవివరణ:
ఉన్నది బెత్తెడు కడుపు, అదెంత తింటుంది? పట్టెడన్నమే కదా. దీనికొరకేనా ఇన్నిపాట్లు మనము పడి పొర్లుతున్నది?
ఇతరుల మనసులు బాధ పెట్టే పనులు చేసే దుఃఖకరమైన బ్రతుకు ఎందుకు?
ఈర్ష్య,అసూయలకు లోనై మనము ఇతరులు బాగుపడుతూంటే చూసి ఓర్వలేని బ్రతుకు ఎందుకు?
ఎదుటివారికి చేసే మేలు కూడా మనకు మేలే అని చెప్పని విద్య ఎందులకు?
ఆశలలో మునిగిపోయి ఎల్లప్పుడూ సతమతం చేసే డబ్బు ఎందులకు?
భగవంతుని సేవ లేకుండా జీవితాన్ని భ్రాంతిలో పడవేయు ధనమెందుకు?
పరమాత్మను తెలియలేక అన్ని రకాల దారులలో కన్నుగానక తిరుగు జీవుని దొరతనం (నేనే గొప్ప అనుకోవడం) ఎందుకు?
Thursday, April 19, 2012
Wednesday, April 11, 2012
ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి.

లాభాల కోసం ఇతరులను త్రొక్కివేసే వారిని ప్రోత్సహిస్తారో లేక తమ మానాన తాము ఎవరినీ మోసం చేయకుండా కేవలం బ్రతకడం కోసమే వ్యాపారం చేసుకునేవారిని ప్రోత్సహిస్తారో ఆలోచించుకోండి.
చిత్రంలో దాగున్నదెవరో కనుక్కోండి?

ఈ చిత్రం లో దాగున్నదెవరో కనుక్కోగలరా?
ఒకవేళ కనుగొనడానికి ఇబ్బంది ఐతే
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
చిత్రాన్ని చూస్తూ మీ తలను కంటిన్యూగా ఆడించండి.
Monday, March 19, 2012
తప్పించుకొనేందుకు పారిపోయివస్తే మళ్ళీ ఇలాగైందేమిటి? - రమణమహర్షులవారు

శ్రీరమణమహర్షుల వారు ఆశ్రమంలో ఉండగా గతంలో రమణుల పాఠశాల జీవితంలో వారికి తమిళం భోధించిన ఉపాధ్యాయుడు ఒకసారి వచ్చారు. ఆ ఉపాధ్యాయుడిని గుర్తించిన మహర్షి తాను రచించిన ఒక తమిళ గ్రంధాన్ని ఆయనకు సమర్పించారు.
మహర్షి రచనా విధానాన్ని ఆ ఉపాధ్యాయుడు ఎంతగానో మెచ్చుకొన్నాడు.ఆ తర్వాత ఆ గ్రంధంలోని ఒక పద్యానికి అర్థం అడిగాడు. అప్పుడు మహర్షి సమీపంలోని భక్తుల వంక చూస్తూ ఇలా అన్నాడు.
"ఆయనను చూడండి. ఇటువంటి ప్రశ్నల బెడదను తప్పించుకునేందుకే నేను బడి నుండి పారిపోయాను.ఆయన మదురై నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. దీని అర్థం ఏంటి?" అని చమత్కరించారు.
అదివిన్న జనం భక్తులతో సహా గొల్లున నవ్వారు.
Friday, March 16, 2012
Wednesday, March 7, 2012
ఈ శిల్పము యొక్క అర్థం ఏంటో వివరించగలరా?

గత ఆదివారం నేను నా స్నేహితుడు ఉదయ్ కడప జిల్లా ఒంటిమిట్ట దేవస్థానమునకు వెళ్ళాము.
అక్కడ అనేక శిల్పాల ఛాయాచిత్రాలు తీసుకున్నాము.
అందులో ఈ శిల్పమునకు అర్థం ఏమయ్యుంటుందో చెప్పగలరు.
Wednesday, February 29, 2012
Tuesday, February 21, 2012
Wednesday, February 15, 2012
Subscribe to:
Posts (Atom)
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...