తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, July 9, 2010

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది?

మనకు తెలుసు హిందూమతం లో 108 సంఖ్యకు గల ప్రాముఖ్యత.జపమాలలోని పూసలు 108. ఇంకొన్ని ప్రత్యేకతలుచూద్దాం.
1.వేదాల ప్రకారం
#భూమికి,చంద్రునికి మధ్యదూరం,చంద్రుని వ్యాసానికి 108 రెట్లు
#భూమికి,సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు
#సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.
నేటి విజ్ఞానం ప్రకారం కూడా ఇవి దాదాపు సరిపోలాయి.

2.ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మర్మస్థానాలు 108.

3.నక్షత్రాలు 27.వాటికి ఒక్కొక్కటికి గల పాదాలు 4. 27*4=108

4.రాశులు 12.గ్రహాలు 9. 12*9=108.

5.భరతనాట్యంలో మొత్తం నాట్యభంగిమలు 108.

6.ఉపనిషత్తులు 108.

7.108=1*2 వర్గం*3 ఘనం=1*(2*2)*(3*3*3).

8.భగవద్గీత అధ్యాయాలు 18.మహాభారత పర్వాలు 18.ఇవి 108 యొక్క కారణాంకాలు.

4 comments:

 1. హిందు మతం ప్రకారమే కాదు, సూఫి సిద్దాంతాల ప్రకారం కూడా 108 చాలా ముఖ్యం.. ఆ సంఖ్య గురించి మరొక వివరణ:
  ఒక మనిషి సగటున రోజుకు 21600 సార్లు శ్వాస తీసుకుంటాడు..అందులో పగలు సగం రాతి సగం.. రాత్రి పూటనిద్రా సమయం కనుక అది తీసేస్తే 10800 సార్లు శ్వాస తీసుకుంటాడు.. 108 సార్లు దైవనామస్మరణ చెయ్యడం అంటే 100 సార్లు శ్వాస తీసుకున్నదానికి ఒక్కసారి దేవుణ్ణి స్మరించాలని పెద్దల ఉవాచ..
  (2001 లో రామకృష్ణ ప్రభ అనే బుక్ లో చదివాను).

  and this very much matches with the scientific count.. avg human breaths per day ranges b/n 21400-21800 and the exact average comes abt 21604.

  -Karthik

  ReplyDelete
 2. కాలంతోపాతుగా నిర్వచనాలు మారుతున్నాయి అండానికి మీ పోస్ట్ ఒక ఉదాహరణగా నిలుస్తోందండీ.వైద్య/యోగా శాస్త్రాల ప్రకారం మన దేహంలోని మొత్తం నాడుల స౦ఖ్య ౭౨-వేలు.వీటిలో అతి ముఖ్యమైనవి ౧౦౮.మనసా/వాచా/కర్మణా చేసే పాపాలు ఈ ౧౦౮ నాడుల్లో నిల్వ ఉంటాయి.వీటిని ,రోజు ౩-సార్లు జపం[౧౦౯-ఉన్న మాలతో]చేయడం ద్వారా సుద్ధ్హి చేసుకోమ్మని పెద్దలు చెబుతున్నారు .ఇక మీరు చెప్పిన గణాన్కాలకు నేను అభ్యంతరం పెట్టను సుమా? --జయదేవ్.చల్లా

  ReplyDelete
 3. కార్తీక్ గారూ! అదనపు సమాచారం అందించినందుకు కృతజ్ఞతలు. అలాగే జయదేవ్ గారికి కూడా.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు