తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, July 19, 2010

సముద్రంలో ప్రయాణాన్ని వేదాలలో నిషేధించలేదు

ఋగ్వేదం 4 అధ్యాయం,9 అనువాకం,48 సూక్తంउवासोषा उछाच्च नु देवी जीरा रथानाम

ये अस्या आचरणेषु दध्रिरे समुद्रे न शरवस्यवःఅర్థము:


ధనము కోరువారు సముద్రమున నావలు నడుపుతారు.ఆట్లే ఉదయాకాశమును ఉషోదేవినడుపుచున్నది.ఇంతకు పూర్వము కూడా నడిపినది.ఇప్పుడూ నడుపుచున్నది.సముద్రమున నావలు నడపడం ధనం కొరకు అని అన్నప్పుడు,సముద్రయానం వ్యాపారం కొరకే అని కదా అర్థము.దీనినిబట్టి వేదకాలములోనే మన పూర్వీకులు సముద్ర ప్రయాణం (ఇతర దేశాలతో కూడా అయ్యుండవచ్చు) ద్వారావ్యాపారము చేస్తున్నట్టు అర్థం అగుచున్నది.అంతేకాక సముద్రయానము నిషేదము అన్నది వేదకాలం తర్వాత ఎవరో మన గ్రంధాలలో చొప్పించారు అన్నది అర్థంఅవుతోంది.

4 comments:

 1. vedaas doesnt baned the sea travels @all sir but as a punishment only it was told.If one can commit a great sin,that person should b punished wth this type of siksha....

  ReplyDelete
 2. సురేష్ గారు

  మంచి ప్రయత్నం.

  అలాగే మంగళవారం మంచిది కాదని చాలా మంది తమ పనులను, ప్రయాణాలను ఆపేస్తుంటారు. అలాంటిది ఏదీ వేదాలలో లేదని ఎవరో చెప్పగా విన్నాను. అలాగే అష్టమి మంచిది కాదని, ఆషాఢ మాసం మంచిది కాదని, అమావాస్య మంచికి కాదని రక రకాల నమ్మకాలు వ్యాప్తిలో ఉన్నాయి. అలాంటి వాటికి కూడా మీరు వేదాలలో ఏం వుందో వివరించడానికి ప్రయత్నిస్తే కొన్ని మూఢ నమ్మకాలైనా తప్పించుకొనే అవకాశం ఉంది.

  ReplyDelete
 3. @hari-jyotishasaastra saya mangalavaaram as "jayavaaramu"..adae vidhamgaa..aayurvedam "astamee vyadhi naasini"ani niroopisthondi.amaavaasya nunchi chandruni balam perugutundi kaabatti mana porugu raastram ayina tamilulaku adhi manchidi ayindi."aashadaaniki aakali ekkuva"e kaaranamgaa kotha dampatulu sambhogamlo paalgontae,aakali meeda aakali vesi vaalla aarogyalu paadaipothaayi kanuka dampathuluku maatram aashadam kattadi chesaaru mana vibhudhulu.mangala/astami/amaavaasya/aashaadalu anni manchivae.......

  ReplyDelete
 4. మంచిగా చెప్పారు సురేష్ గారు..

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు