తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, July 13, 2010

పరమశివుడి నటరాజతాండవంలో వెలువడిన శబ్దాలు ఇవే!


మన అందరికీ తెలుసు పాణిని అనే మహాఋషి సంస్కృత వ్యాకరణాన్నిరచించాడని. పరమశివుడు నటరాజుగా నాట్యం చేసేప్పుడు పాణిని మహర్షి అప్పుడు ఆ నాట్యంలో పుట్టినశబ్దాలను గ్రహించి వ్యాకరణాన్ని వ్రాసాడు. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. సాక్షాత్ పరమశివుడు నాట్యం చేస్తున్నప్పుడు వచ్చిన ఆ శబ్దాలేంటో తెల్సుకోవాలనే ఉత్సుకత చాలామందికి ఉంటుంది కదా. ఆ శబ్దాలేంటో చూద్దామా!

'అఇఉణ్‌, ఋఌక్, ఏఓఙ్, ఐఔచ్‌, హయవరట్‌, లణ్‌, ఞమఙణనమ్‌, ఝభఞ్‌, ఘఢధష్‌, జబగడదశ్‌, ఖఫఛఠథచటతవ్‌, కపయ్‌, శషసర్‌, హల్‌'

ఈ పదునాలుగు శబ్దాలనూ పదునాలుగు సూత్రాలు గా పాణిని మహర్షి గ్రహించి సంస్కృత వ్యాకరణాన్ని రూపొందించాడు, ఈ 14 సూత్రాలను మాహేశ్వరసూత్రాలు అంటారు.

అచ్చులకు ఆకారము మొదటిది. ఈ మాహేశ్వర సూత్రాలలో 'అ' అనేది మొదటవది. 'హల్‌' చివరిది. వీనిమధ్యలో ఇమిడిఉన్న అచ్చులనూ, హల్లులనూ 'అల్‌' అనేది సూచిస్తుంది. 'అలోంత్యస్య' అనేదొక పాణినిసూత్రం.

7 comments:

  1. ఇంటర్లో మా సంస్కృతం మాస్టారు కూడా చెప్పారు ఇవే శబ్దాలు.ఆ రోజులు గుర్తుకు వచ్చాయి మీ టపా చదువుతుంటే...

    ReplyDelete
  2. శబ్ధాలు 15 గా ఉన్నాయి - సరి చూడగలరు .
    _______________________________

    రవిచంద్రా, మీకు చక్కటి సంస్కృతం మాష్టారు లభించారనుకుంటా.
    దానికీ భగవదనుగ్రహం / పూర్వ జన్మ సుకృతం ఉండాలి కాబోలు.

    ReplyDelete
  3. అవునండీ. పొరపాటున ఖఫఛఠధచటతవ్ మధ్య కామా పెట్టడం వలన 14 కాస్తా 15 అయ్యాయి. పొరపాటును చూపించినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  4. పాణిని విరచిత ‘మాహేశ్వర సూత్రాల’ గురించి రాయటం బావుంది. అయితే తెలుగు లిపిలో రాసే ప్రయత్నం బావున్నా, రెండు పదాల్లో ‘ఋఈక్’ , ‘ఖఫఛఠధచటతవ్’ దోషాలు కనిపిస్తున్నాయండీ.
    మొదటి పదంలో రెండో అక్షరం ‘లు’ (అలూ), రెండో పదంలో ఐదో అక్షరం ‘ధ’ కాకుండా ‘థ’ అని ఉండాలి.
    ‘పరమశివుడు నాట్యం చేస్తున్నప్పుడు వచ్చిన శబ్దాలుగా వీటిని నమ్ముతారు’ అని రాసివుంటే సర్వజనామోదయోగ్యంగా ఉండేది. ఏమంటారు?:) ‌

    ReplyDelete
  5. ఋఈక్‌, కాదు ఋఌక్; ఏఓజ్‌ కాదు ఏఓఙ్;

    ReplyDelete
  6. ఖఫఛఠధచటతవ్‌ లో ధ తప్పు థ సరైనది.(ఖఫఛఠథచటతవ్‌)

    ReplyDelete
  7. చింతా గారూ! టైపు లో కొన్ని తప్పు పోయాయి. సరిదిద్దడానికి సహాయపడినందుకు ధన్యవాదములు.

    ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు