తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, July 21, 2010

యోగ్యుడైతే నీ విద్యను చెప్పు,ఎవరూ దొరకకపోతే నీలోనే ఉంచుకో - ఇదే వేదాల అభిప్రాయం

ఇది నా ౨౦౦(200)వ టపా.

మన వేద విద్య లేక విజ్ఞానం అన్నది గురుశిష్య పరంపరగా ప్రసరిస్తూ ఉంది. వ్రాతమూలకంగా వేదాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా వేదాలు స్వరప్రధానం అయినందువలన విని వల్లెవేస్తూ నేర్చుకోవడం అవసరం అయింది. అందుకే వేదాలను ఇలా విని నేర్చుకోవడం వలెనే "శ్రుతి" అని కూడా పిలుస్తున్నాం. మనము వేదాలలోని విజ్ఞానాన్ని చూస్తూనే ఉన్నాం.

అసలు ఈ విజ్ఞానం లేక విద్య ఎవరికి అందాలి అన్న విషయంలో వేదాలు ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. క్రింది శ్లోకాలు చూడండి.

సామవేదం లోని ఉపబ్రాహ్మణమైన "సంహితోపనిషద్ బ్రాహ్మణం" లోని శ్లోకాలు ఇవి.

"విద్య వై బ్రాహ్మణం ఆజగామ తవహం అస్మి త్వం మాం పాలయస్వ-అనర్హతె మానినెమాదా
గోపాయ మా శ్రేయసీతె అహమస్మి విద్యా సార్ధం మ్రియెత్ నా విద్యాం ఊషరెవపెత్"(3-9,10)

అర్థం:
ఒకసారి "విద్య" ఒక తపస్వి దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థించింది." నేను నీ దానిని. నన్ను చక్కగా అభ్యసించి పాలించు. అయోగ్యుడు,దురభిమాని అయిన శిష్యుడికి నన్ను ఇవ్వకు.నన్ను
నీలోనే ధరించి కాపాడు. నీకు ఎన్నటికైనా మంచి(శ్రేయస్సు)నే చేస్తాను. ఎప్పటికీ ఊషరక్షేత్రం(ఉప్పుచవిటి నేల) లాంటి అయోగ్యుడి చేతిలో మాత్రం ఉంచకు."

ఈ శ్లోకపు భాష్యం:

"యోగ్యుడైన శిష్యుడు దొరక్కపోతే తన విద్యను తనలోనే ఉంచుకోవాలే కాని ఎన్నటికీ అలాంటి వారికి తను నేర్చుకొన్న విద్యను చెప్పరాదు. దానివల్ల వాడు లోకకళ్యాణం సాధించకపోగా
లోకవినాశనానికే కారణం అవుతాడు."

విజ్ఞానం లేక విద్య అనేది ఎవరికి,ఎలాంటివారికి అందాలి అనే విషయాన్ని వేదాలు ఇంత విస్పష్టంగా ప్రకటించాయి.

6 comments:

 1. @సురేష్ గారు,
  మ౦చి మాట చెప్పారు... ఇది ఏ కాలానికైన పనికొచ్చే మాట..

  ఇకపోతే ఒక కొత్త పదం నేరుచుకునన్నాను .. అది ఊషరక్షేత్రం... :)
  మన దేశాలో ఇవి చాల ఉన్నాయి :)

  ReplyDelete
 2. కొన్ని అమూల్యమైన .అరుదైన,ప్రాచీన విద్యలు ప్రస్య్హుత తరాలకు అందకున్దాపోవడానికి ఇదొక కారణం.అందుకే అపాత్ర దానం వద్దన్నారు పెద్దలు.

  ReplyDelete
 3. చిరంజీవీ!
  చాలా చక్కని విషయాన్ని అద్భుతంగా వెలుగులోకి తెచ్చావు. ఆ వేదమాత నీ బోటి మంచివారినెల్లప్పుడూ రక్షించుకొంటూ తనను తాను రక్షించు కొనును గాక.
  శుభమస్తు.

  ReplyDelete
 4. అందరికి ధన్యవాదాలు.
  @ చింతా గారు!
  ##చాలా చక్కని విషయాన్ని అద్భుతంగా వెలుగులోకి తెచ్చావు##
  అంతంత పెద్ద మాటలు వద్దండి.నా దృష్టిలోనికి వచ్చింది,నేను చదివింది మీ అందరితో పంచుకొంటున్నానంతేనండి.

  ReplyDelete
 5. సురేష్ గారు

  ఆ జ్ఞానసరస్వతే మీ చేత ఇలా వేద సౌరభం గురించి వ్రాయిస్తోంది. మీ ద్వారా ఈ విషయాలు మాకు తెలియడం ఆనందకరం.
  శ్రీవాసుకి

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు