తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, July 22, 2010

పండ్లు తినడానికి పండ్ల తోటలోనికి వెళ్లి పండ్లు తినకుండా ఆకులెన్ని, చెట్లెన్ని,కొమ్మలెన్ని అని లెక్కపెట్టడం ఎందుకు?

చాలా ఆకలి మీద పండ్ల తోటలోనికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక తీరా పండ్లు తినకుండా ఆకులెన్ని, చెట్లెన్ని,కొమ్మలెన్ని అని లెక్కపెడుతుంటే ఎవరికి నష్టం? కావాలంటే ఆకలి తీరాక ఆ పని చేసుకోవచ్చు.

కాని మన దురదృష్టం ఏంటంటే నేడు మనం చేస్తున్న పని లెక్కెట్టుకోవడమే, తిని ఆకలి తీర్చుకోవడం కాదు.సాధారణంగా వేదాలు కాని, మరేవైనా గ్రంధాలు కాని చదవాలని ఎందుకు అనుకొంటాము.

మనకు కావలసినది మనం చదివే పుస్తకాలలో నుండి మన జీవనమార్గాని కొక దీపం... నిజానికి ఆ పుస్తకం ఏనాటిది? ఎవరు వ్రాసారు? మొదలైన చర్చలు అసలువిషయాన్ని మన దృష్టినుండి ప్రక్కకు తొలగిస్తున్నాయి. ఇట్లాంటి ప్రశ్నలవల్ల మన దృష్టిలో ఆ పుస్తకాల విలువ తగ్గిపోవడమేకాక వాటిపై నిరాదరణ ఏర్పడి వానిపై మనము ఉంచవలసిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా ఉంచలేకపోతాము. అది పిల్లలు తినడం కోసం పెంచబడుతున్న పండ్ల తోటలను బాటనీ లాబొరేటరీలుగా మార్చినట్లు అవుతుంది. అలా ప్రయోగశాలలుగా మార్చామనుకోండి, వివిధ రసాయనాలు అవీ కలపవలసివస్తుంది. అప్పుడు అసలు దేనికోసం ఆ పండ్ల తోటను పెంచుతున్నామో ఆ అసలు పని ఇక వీలు కాదు. మనం ప్రస్తుతం శాస్త్రాలను,గ్రంధాలను చదివేపద్దతి కూడా ఇలానే ఉంది.

లేదు, ఆ పుస్తకం ఏనాటిది? ఎవరు వ్రాసారు? మొదలైనవి కనుగొనాలి అనేవారు ఉన్నారంటే అది వేరే సంగతి.వారు అందుకు చదువుతారు.అది వారు చదువుతున్న కారణం.

మన కారణం అది కానప్పుడు మన కారణం అందులోని విషయాలు ఏంటి? మనకు పనికొచ్చేవా,కాదా? ఆచరణలో పెట్టగలమా లేక పెట్టవచ్చా?అవి మనకు ఎలా ఉపయోగపడతాయి? అయినప్పుడు కూడా పైన చెప్పినవారి పనే చేస్తుంటే ఎవరికి నష్టం?

మనం ఒక పదానికి అర్థం కావాలని నిఘంటువు(Dictionary) చూస్తాం. కాని ఆ పదానికి అర్థం వెదికే క్రమంలో అనేక ఇతరపదాలు కనపడి వాటి అర్థం కూడా చూస్తూ ఒక్కొక్కసారి మనం అసలు ఏ పదానికి అర్థం చూడాలనుకొంటామో ఆ పదాన్ని మరచిపోతుంటాం. తర్వాత ఆ పదం గుర్తుకు రాక అదేంటో అని ఆలోచిస్తూ నరకయాతన పడుతుంటాం. ఇది అందరికి అనుభవమే అనుకొంటున్నాను. మిగతా పదాల అర్థాలు తెలిసాయి కదా అని అంటారేమో మంచిదే, కాని మన అసలు పని కాలేదు కదా.

ఒక అడవిలో రాత్రి పూట అడవి జంతువులు,పురుగులు,పాములు మొదలగునవి మన వద్దకు రాకుండా మనం కాపాడబడడం కోసం మనం కట్టెలు పేర్చి మంట పెట్టామనుకొందాం. ఇక్కడ
"రక్షణ" అనేది ప్రధాన కారణం,లక్ష్యం. ఆ మంట వెలుగులో మన వద్ద ఏమైనా దుంపలు అవీ ఉంటే వాటిని ఉడికించడం,తినడం అంతేకాక చలిగా ఉంటే మనకు వెచ్చదనం రావడం అనే ప్రయోజనాలు
అనుషంగికం.అంటే మన అసలు కారణం చెడకుండానే ఇతర ప్రయోజనాలు కలగడం.

అలానే మనం దేనికోసం పుస్తకాలు చదువుతున్నామో దాని కోసం చదివేటప్పుడు ఇతర విషయాలు మనకు తెలిస్తే తెలియనీ! మేలే, కాని అసలు విషయం మాత్రం మనం మరిచిపోకూడదు.

ఎవరెందుకు చదువుతున్నారో అందుకే మొదట చదవాలి. కావాలంటే చదివిన కారణం తీరాక ఆ పుస్తకాన్ని వ్రాసిన రచయిత ఎవరు? అతను ఏ కాలం వాడు లాంటివాటిపై దృష్టి పెట్టి కనుగొనడానికి ప్రయత్నించవచ్చు.

22 comments:

 1. @సురేష్ గారు,

  అదేంటండి బాబు.. అలా అంటారు.. ప్రశ్ని౦చాడ౦ నా జన్మహక్కు???? శోధన మీ వ౦తు... నాకు తోచిన తలా తోకా లేని మరియు బోడిగుండికి మోకాలుకీ లింక్ పెట్టే ప్రశ్నలు అడుగుతా.... కానీ నేను మాత్రం శోదించను..ఎందుకంటే నేను ప్రశ్ని౦చదమే శోధన అనుకుంటా కదా!.. ఒక వేళ మీరు సమాధాన౦ ఇవ్వకపోయినా లేదా ఇచ్చినా అది నా విషయ వాచాలతను ప్రస్నిచినట్లు౦టే వెంటనే ఒక పెద్ద రిప్లై ఇచ్చి నా అజ్ఞానాన్ని మరిన్ని ప్రశ్నల రూపంలో మరింత చాటుకు౦టా.. ఇక దానిని మభ్య పెట్టేందుకు {ప్రశ్నించి తెలుసోకోవాలి!!!??} అనే మాట జుగుప్సాకరమైన పద్దతిలో చెప్తా..

  అంతే కాని.. అదేమిటి?.. దానిని ప్రశ్నిచేముందు నేను చేసిన కసరత్హు ఏమిటి?.. నాకున్న అనుభవం ఏమిటి అందులో?.. గుడ్డిగా అడిగి మన వాచాలత బయట పెట్టుకుంటే నష్టం ఎవరికీ??.. పోనీ కనీసం నా ప్రశ్నలు ఇతరులని ఆలోచింప చేసే విధ౦గా ఉన్నాయా?.. . ఇవేమి అక్కర్లేదు..
  కొసమెరుపు ఎమిట౦టే నేను ప్రశ్నలు అనే ముసుగులో విమర్శల జడివాన కురిపిస్తా...


  వెనకటికి ఓ కథ , శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజాచార్యులు చెప్పగా విన్నాను..
  ఒకరోజు ఒక ఊళ్ళో పెద్దవాళ్ళు అందరూ సాయంకాలాన పెద్ద అరుగు మీద కూర్చొని భారత రామాయణ ఇత్యాది పురాణాలలో ఉన్న మంచి చెడ్డలు గురించి చెప్పుకుంటూ ఉన్నారు..

  అందులో నేను పైన చెప్పిన కోవలో వచ్చే ఉద్ద౦డ పండితుడిని అని అనుకునే ఒకడు లేచి... ఆ భాగవత౦ చెప్పింది.. విష్ణువు లేడు .. వాడిని దూషి౦చు అనే గదా చెప్పి౦ది? .. అని అన్నాడు..
  ఇది విన్న పెద్దల౦దరికి ఆశ్చర్యంతో పాటు చిన్న కోపం కూడా కలిగి౦ది.. ..వాళ్లకి తెలుసు అందులో ఏమి చెప్పారో .. వాడి ప్రశ్నను చాలా తేలిగ్గా తేసుకోనేవారే కానీ అక్కడే ఉన్న సామాన్య ప్రజానీక౦ వాడు చెప్పిందే నిజం అనుకోకుండా అలానే వాడి వాచలతని వాడి చేతే బయట పెట్టించాలని.. వాడ్ని పిలిచి భాగవత గ్రంధం చూపించి వాడు చెప్పినడి ఎక్కడ ఉందొ చూపించమని అడిగారు.. వాడు ఆ గ్రంధంలో హిరణ్యకశపుడు తన కొడుకు ప్రహ్లాదుడి తో అన్న మాటలు చూపించాడు.. అంటే వీడు ఆ ఒక్క పుట చదివి భాగవత౦ అ౦తా అదే అనుకున్నాడు.. పెద్దలు ఇది అందరికి చెప్పి వాడి వాచలతని/మూర్కత్వన్ని సున్నిత౦గా విమర్శిస్తూ ఇకనున్చినా ప్రశ్నిచేముందు చక్కగా అంత చదివి అర్థం చేసుకొని ఆ తర్వాత ప్రశ్ని౦చడమ్ నేర్హ్సుకో అని చెప్పారు..

  హా... అదండి సంగతి.. ఒక విషయ౦.. ఫై కథలో గుడ్డితో పోల్చుకుంటే మెల్ల నయం అన్నట్లు వాడు కనీసం ఏది ఒక పుట అన్నా చదివాడు... కాని ఈ కలలో ధృతరాష్టపుత్రులు ఎక్కువ.. పోనీలే పాపం అనుకుంటే గాంధార పుత్రులు(కళ్ళు ఉండీ కబోదిగా నటించడ౦) గా సమాజంలో తమదైన {లెగసీ} ని అనుభవిస్తున్నారు.. కానివ్వ౦డి!!!!..

  ReplyDelete
 2. రాజేష్ గారు మీరు ఇలా ప్రశ్నిస్తే మీ మీద కేస్ పడుతుంది.
  మేము చాలా 'శో'ధించాం. ఇప్పుడు సాధిస్తున్నాం

  ReplyDelete
 3. @సురేష్ గారూ ఈ పోస్ట్ చాలా టైమ్లీ గా వ్రాసారు. థాంక్స్. చూడండి ఇక్కడ ఏమి జరిగిందో.

  అమెరికా నుండి లేటెస్ట్ వార్త. బ్లాగ్గేర్ ప్రశ్నించి ఆమె ఉద్యోగం ఊడపీకించారు. తరువాత క్షమాపణలు. ఆమె పేరు shirley sherrod. గూగుల్ చేసుకోండి ఇంకా తెలుసు కోవాలంటే అర్ధం లేని వ్యాఖ్యలు వేటికి దారి తీస్తయ్యో.

  which started with a conservative blogger posting controversial remarks she made, and led to her ouster as an Agriculture Department official and then, ultimately, apologies from both the White House and Agriculture Secretary Tom Vilsack.

  ReplyDelete
 4. @బ్లాగు బ్రహ్మ గారు,

  నేను ఎక్కడ ప్రశ్ని౦చానండి బాబు.. కాకపోతే {నా}గురించిన నిజాలని పాపం
  సురేష్ గారి లాంటి అమాయకులకు చెబుతున్నా :) అంతే..

  ReplyDelete
 5. @rajesh---ఎవరిపిచ్చి వారికాన౦ద౦ మరి

  ReplyDelete
 6. @ suresh garu
  chaala baaga chepparu. meeru cheppinadi 100% correct

  ReplyDelete
 7. @ సురేష్ గారు,
  బాగా రాసారు. కానీ ఒక అనుమానం.. ఏ సూత్రావళి అయినా ఎంత గొప్పది అన్నది అది చదివి సామాన్యుడు ఎంత లాభం పొందాడు అన్నదాని పై ఆధారపడుతుంది అని నాకు అనిపిస్తుంది. శ్రీ కంచి శంకరాచార్యులు , శ్రీ వివేకానంద స్వామి లాంటి వారి జ్ఞానం అసమానమైనది. వారు వేదాలు చదవకపోయినా సొంతంగా ఏది సరి అయిన మార్గమో తెలుస్కునే వారు కామొసు. వారు నడుచుకున్న విధంగా ఇంకెంతమంది నడుచుకోగలిగారు ? ఒక సమాజం ఆచరించిన , చదివిన సూత్రావళి ఆ సమాజాన్ని లోప రహితంగా చెయ్యలేకపోతే.. ఆ సూత్రావళి ఎంత గొప్పదైనా పూర్తిగా లోపరహితం కాకపోవచ్చు.
  ఇంకా సంక్లిష్టత , కాంట్రడిక్షన్ వంటివి.. పామరులని కంఫ్యూజ్ చేస్తాయి.

  ReplyDelete
 8. చాలా బాగా సెలచ్చారు, సురేష్ బాబు గారు.
  పడ్లతోట లోని పళ్ళు తినటానికి యోగ్యంగా వున్నాయా, లేదా పళ్ళు పులిసిపోయి, పురుగులు తొలిచాయా అనేది మొదట చూడాలి కదా? తరువాత పళ్ళను శుభ్రంగా కడిగి తినాలి. ఇవేవీ చేయకుండా పండ్లతోట మీద మనుషులమైన మనం మేకల గుంపులా పడి కస కసా మేసేయలేము కదా?
  ప్రశ్నించినంత మాత్రాన విమర్శించినట్టు వుడుక్కోకూడదు. మెచ్చినంత మాత్రాన వారు ఆచరిస్తున్నట్టూ కాదు, ఏదో 'వూ ' కొడుతున్నారేమో.

  ReplyDelete
 9. @ krishna గారు!
  ###ఏ సూత్రావళి అయినా ఎంత గొప్పది అన్నది అది చదివి సామాన్యుడు ఎంత లాభం పొందాడు అన్నదాని పై ఆధారపడుతుంది అని నాకు అనిపిస్తుంది.##
  టపాలో వ్రాసింది కూడా అదే కదండీ.
  టపాలో వ్రాసింది
  ""మనకు కావలసినది మనం చదివే పుస్తకాలలో నుండి మన జీవనమార్గాని కొక దీపం"" ఇదే కదా! అంటే వ్యాఖ్యలో పైన మీరన్నదే.

  @ snkr గారు!
  ###పడ్లతోట లోని పళ్ళు తినటానికి యోగ్యంగా వున్నాయా, లేదా పళ్ళు పులిసిపోయి, పురుగులు తొలిచాయా అనేది మొదట చూడాలి కదా? తరువాత పళ్ళను శుభ్రంగా కడిగి తినాలి. ఇవేవీ చేయకుండా పండ్లతోట మీద మనుషులమైన మనం మేకల గుంపులా పడి కస కసా మేసేయలేము కదా? ###
  టపాలో కూడా అదే ఉన్నదండి.""" మన కారణం అందులోని విషయాలు ఏంటి? మనకు పనికొచ్చేవా,కాదా? ఆచరణలో పెట్టగలమా లేక పెట్టవచ్చా?అవి మనకు ఎలా ఉపయోగపడతాయి?"""
  మీరడిగినదానికి టపాలోని పై వాక్యం సరిపోతున్నదేమో చూడండి.

  ##ప్రశ్నించినంత మాత్రాన విమర్శించినట్టు వుడుక్కోకూడదు##
  టపాలో దీనికి సంబంధించిన విషయం వ్రాయబడనేలేదండీ.

  ReplyDelete
 10. @ సురేష్ గారు,
  నేను అడిగిన ప్రశ్న సరిగా చెప్పలేకపోయానేమొ ?
  ఒక విషయాన్ని కంటెంటు బట్టి అంచనా వేయడం ఒకటి.
  దానిని వాడిన తరువాత కలిగే ఫలితాలని బట్టి అంచనా వేయడం ఒకటి.కంటెంట్ మరీ ఆదర్శవంతం అయ్యిపోయి సామాన్యులకి ఆచారణ యోగ్యం కానప్పుడు దాని గొప్పతనమే దాని లోపం అయ్యి కుర్చుంటుంది.
  వేద పఠనం వలన మనుషులు ఉత్తములు అవుతారని అనుకుంటే ( కొద్ది మంది మినహాయింపు వుండవచ్చు..వారికి ఏ వేదాలు సత్యాన్ని చూపలేకపోవచ్చు.) .. ఎక్కువ మంది ఉత్తములు వుండే సమాజం లో లోపాలు వుండకూడదు.కానీ మన సమాజం లో దురాచారాలు, అసమానతలు, వివక్షలు వుండేవి.. వున్నాయి.. ఇక మీదట వుంటాయి.
  ఉత్తములు ఈ అసమానతలు చూపకపోవచ్చు గాక! కానీ తమ చుట్టుపక్కల జరుగుతున్న అసమానతలని ఉపేక్సించరు కూడా కదా!
  వేదాలు చదివే ప్రతి ఒక్కరు ఒక శంకరాచార్య, ఒక రామకృష్ణ పరంహంస , ఒక గాంధి అవ్వకపోయిన కనీసం బాధ్యత కలిగిన మనిషిగా తమ సామాజిక బాధ్యతని నిర్వర్తించాలి కదా! మరి అది నిజమైతే వేద పఠనం చేసి సామాన్యులకి దారి చూపవలసిన వారు , సమాజం లో చెడుని ఎలా ఉపేక్షించారు ?
  దీని బట్టి ఆ వేదాలు చదివినా మనుషులు ఉత్తములు అవుతారు అని గ్యారంటీ ఏమిటీ లేదు అని తెలియడం లేదా? కుళ్లిపోయిన పళ్లు తింటే అనారొగ్యం పాలయిన వారిని చూసి మిగిలిన వారు అవి తినకుండా వుండడం తప్పు కాదు కదా!
  నేను snkr గారు అన్నట్టు పళ్లు కుళ్లినివా , మంచివా చూడలేకపోతున్నాను అనుకోండి, అప్పుడు ఆల్రేడీ ఆ పళ్లు తిన్న మిమ్మలని చూసి ఒక అంచనాకి వస్తాను, అది తప్పు కాదు కదా!ఒక ఆరొగ్యవంతుడు ఆ పళ్లు తిని కొత్తగా ఆరోగ్యవంతుడూ అవ్వడు కదా! ఒక రోగిష్టి వాడు ఎంతగా ఆరోగ్యవంతుడూ అయ్యాడన్నది చూడాలి. శంకరాచార్యులు తదితరులు ముందు నుండే ఆరొగ్య వంతులు.. వారు వేద ఫలం వలన కొత్తగా ఆరొగ్యవంతులు అయ్యినది ఏమి లేదు. సామాన్య ప్రజలు, సమాజం ని కట్టుబాట్లలోకి నడిపే వారు, ఆ వేదఫలం వలన ఎంత ఆరొగ్యవంతులు అయ్యి వున్నారు?
  ఇప్పటి విధ్యా వ్యవస్థ రాక మునుపు ఎంత మంది సంస్కర్తలు సంఘ దురాచారాలు కి వ్యతిరేకంగా పోరాటం చేసారు ? అప్పుడు సమాజం ఎందుకలా దురాచారాలతో నిండిపోయి వుండేది?
  కలికాలం అని చెప్పకండి! సనాతనం అంటే పురాతనం అయి వుండీ కూడా ఎల్లకాలాలకి ఆచరణీయమైనది కదా!

  ReplyDelete
 11. @ krishna gaaru!
  ###వారు వేద ఫలం వలన కొత్తగా ఆరొగ్యవంతులు అయ్యినది ఏమి లేదు. సామాన్య ప్రజలు, సమాజం ని కట్టుబాట్లలోకి నడిపే వారు, ఆ వేదఫలం వలన ఎంత ఆరొగ్యవంతులు అయ్యి వున్నారు?
  ఇప్పటి విధ్యా వ్యవస్థ రాక మునుపు ఎంత మంది సంస్కర్తలు సంఘ దురాచారాలు కి వ్యతిరేకంగా పోరాటం చేసారు ? అప్పుడు సమాజం ఎందుకలా దురాచారాలతో నిండిపోయి వుండేది?###

  నేను ఈ టపాలో వేదాలు అనే పదాన్ని ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకొన్నాను. ""నేను ఇక్కడ ప్రస్తావించినది ఒక పని ( ఈ టపాలో పుస్తకాలు చదివే కారణం) చేసేప్పుడు ఆ పని మొదలుపెట్టిన అసలు ఉద్దేశ్యం మరిచిపోయి ఆ పని యొక్క మిగతా విషయాల గురించి ఆలోచించడం.""

  వేద ఫలాలు,సాంఘిక దురాచారాలు, సంఘసంస్కర్తలు మొదలగు వాటి గురించి ఈ పోస్టులో చర్చించలేదు. మీరు అడిగినవాటి గురించి మరో టపాలో చర్చిద్దాం.

  ReplyDelete
 12. @krishna

  >>>> వేద పఠనం వలన మనుషులు ఉత్తములు అవుతారని అనుకుంటే ( కొద్ది మంది మినహాయింపు వుండవచ్చు..వారికి ఏ వేదాలు సత్యాన్ని చూపలేకపోవచ్చు.) .. ఎక్కువ మంది ఉత్తములు వుండే సమాజం లో లోపాలు వుండకూడదు.కానీ మన సమాజం లో దురాచారాలు, అసమానతలు, వివక్షలు వుండేవి.. వున్నాయి.. ఇక మీదట వుంటాయి.

  Yey samajam ina sampoorna paripoornatha (100% perfection) sadhimchadam kudaradu ani naa abhiprayam ... so, vivaksha anedi complete ga cheripeyatam anedi evvarikina kudarani pani ... devudikinaaa sare ... unless we replace all humans with robots where there is no place for emotions.

  >>> నేను snkr గారు అన్నట్టు పళ్లు కుళ్లినివా , మంచివా చూడలేకపోతున్నాను అనుకోండి, అప్పుడు ఆల్రేడీ ఆ పళ్లు తిన్న మిమ్మలని చూసి ఒక అంచనాకి వస్తాను, అది తప్పు కాదు కదా!ఒక ఆరొగ్యవంతుడు ఆ పళ్లు తిని కొత్తగా ఆరోగ్యవంతుడూ అవ్వడు కదా!

  Meelo aa pallu thinatam valla emi change ochindo telusukonentha parinathi manaku leka pothe? .. it's better just to follow the people around us ... either we succeed or fail as a whole/group. Kaani meeku aa parinathi unte and meeru chestunnadi thappu ani thelisthe thappanisarigaa meeru kotta margam choopettachu ... ade "Adi sankaracharya", Gouthama Buddudu chesindi ...

  >>> శంకరాచార్యులు తదితరులు ముందు నుండే ఆరొగ్య వంతులు.. వారు వేద ఫలం వలన కొత్తగా ఆరొగ్యవంతులు అయ్యినది ఏమి లేదు.
  Ani meeru ela cheppagalaru? Veda Jnanni "jeerninchukovatam valle" vallu aa sthayi ki raagaligaru ani naa abhiprayam ... vedalni pipina chadivi Arishadvargalani jayinchaleni vaadu eppatiki bagupadaledu ... anduke vedala ninaadam "Manasaaa..Vachaa..Karmanaa.."

  Regards,
  Viswanath

  ReplyDelete
 13. @ విశ్వనాధ్ గారు,
  మీ సమాధానంకి కృతజ్ఞతలు.
  >> ఏ సమజం అయినా సంపూర్ణ పరిపూర్ణత (100% పెర్ఫెచ్తిఒన్) సాధించడం కుదరదు అని నా అభిప్రాయం ...
  అలా అయితే ఇప్పుడు వున్న ఏ జీవన విధానం , ఏ సూత్రావళి పూర్తిగా లోపరహితం కాదని ఒప్పుకుని , అందులో లోపాలని దూరం చేసుకునే పని చేయాలి.
  >> it's better just to follow the people around us ... either we succeed or fail as a whole/group.>>
  i cant accept this. better be on the right side than be with the crowd. off course, you have to be conscious enough to know what is the right side.
  >> అని మీరు ఎలా చెప్పగలరు? వేద జ్ఞానాన్ని "జీర్ణించుకొవటం వల్లె" వాళ్లు ఆ స్థాయి కి రాగలిగరు అని నా అభిప్రాయం ...>>
  again i disagree sir, వేల కోట్ల మంది వేదాలు చదివినా శంకరాచార్యులు , వివేకానంద స్వామి కాలేకపోయారు, అంటే వేదాలు చదివినంత మాత్రాన ఎవరు గొప్ప వారు అయిపోరు. అలా అయ్యేవాళ్లే అయితే మన సమాజం శంకరాచార్యులతో, వివేకానంద స్వామిలతో నిండీపోయి వుండేది. మరి ఆ గొప్పతనం ఆ మహానీయులకే చెందాలి.

  ReplyDelete
 14. @ krsihna గారు!
  ##వేల కోట్ల మంది వేదాలు చదివినా శంకరాచార్యులు , వివేకానంద స్వామి కాలేకపోయారు, అంటే వేదాలు చదివినంత మాత్రాన ఎవరు గొప్ప వారు అయిపోరు. అలా అయ్యేవాళ్లే అయితే మన సమాజం శంకరాచార్యులతో, వివేకానంద స్వామిలతో నిండీపోయి వుండేది. మరి ఆ గొప్పతనం ఆ మహానీయులకే చెందాలి.##
  అసలు ఏ పుస్తకాలైనా అవి వేదాలైనా సరే,ఊరకే చదివితే ఏం లాభం ఉంటుంది చెప్పండి. అందులోని విషయాలను ఆచరణలో పెట్టినప్పుడే కదా ప్రయోజనం పొందేదో లేక గొప్పవాళ్ళయ్యేదో. ఒక ఉదాహరణగా ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకాన్ని ఒక 1000 మంది చదివారనుకొందాం. అందరూ ఆ పుస్తకం చదివి అందులో చెప్పిన విధంగా మారతారా? ఏ ఒకరిద్దరో లేక పదిమందో ఆ పుస్తకం చేత ప్రభావితులై తమ జీవనవిధానాన్ని అందులో చెప్పిన విధంగా మార్చుకోవచ్చు అంతే. వేదాలైన సరే ఎంతమంది చదివినా కొందరే ఆచరణలో పెట్టగలరు.
  భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు.
  "వేయిమందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు.అలాంటి వేయిమందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు. ".
  ఇదే విషయం వేదాలకైనా వర్తిస్తుంది. చదివిన అందరూ గొప్పవారైపోతారనుకుంటే అది మన పొరపాటు అవుతుంది.

  ReplyDelete
 15. @ సురేష్ గారు,

  ఏ పుస్తకం అయినా ఎంత ప్రభావ వంతంగా వున్నది ఎలా తెలుస్తుంది ? చదివి అర్ధం చేసుకుని ఆచరణలో పెట్టినది ఒకరిద్దరో అయితే మిగిలిన సామాన్యులని మంచి దారిలో పెట్టలేకపోవడం ఆయా వ్యక్తిత్వ వికాస పుస్తకాల/వేదాల లోపమే!అలా ఆచరణలో పెట్టగలగడం ఆయా వ్యక్తుల గొప్పదనమే! అది చదివి మనకి మంచి దారిన నడవడానికి ప్రేరేపించాలి. ఆ ప్రేరణ ఇవ్వలేకపోతె అది మంచిది ఎలా అవుతుంది? అర్ధం చేసుకుని ఆచరణలో పెడుతున్నామనే చాలా మంది అనుకున్నారు, అది మీకు వారి తప్పుగా కనిపిస్తుంది. నాకు ఆ పుస్తకాల తప్పు అని అనిపిస్తుంది.అసలు నా ఉద్దేశ్యం లో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు/ వేదాలు / ఒక మంచి జీవనశైలికి సూత్రావళి ఎలా వుండాలి?


  అర్ధం చేసుకునేటంత సులభంగా వుండాలి.
  పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వుండకూడదు.
  ఒక నిర్ధిష్ట నియమావళి వుండాలి.
  ఆచరణ యోగ్యంగా వుండాలి.
  ఆ నియమాలు సమయానుకూలంగా సరి అయినవో కావో తరచి చూసుకుని , మార్పులు చేపట్టాలి.


  బహుశా ఇలాంటి నియమావళి ఎప్పటికి రాలేదేమో? ఎందుకంటే ఒక నియమావళి , ఒక జీవన విధానం మొదలయ్యాక, దానిని ఆచరించే వారు ఆయా విధానాల పై ఒక బిలాంగింగ్ నెస్ పొందుతారు. తమ విధానం గొప్పదని ఒక భావం కలుగుతుంది. అందులో తప్పులు వున్నాయేమొ అంటే .. నా ఇష్టం నాది నువ్వెవడీవి అని వ్యక్తిగత దూషణలకి దిగుతారు. విమర్శ ని అంగీకరించలేని తనం కలుగుతుంది.

  ఒక పుస్తకం గొప్పదనం అది చదివిన ఒక అత్యంత అల్పుడు పై అది చూపగలిగే అతి గొప్ప ప్రభావం వలనే తెలుస్తుంది తప్ప, మహనీయుల పై అది చూపిన కొంత మార్పు వలన కాదు! వాల్మికీ ఒక బోయవాడు , క్రూరుడు, జీవ హింస చేసెవాడు అయ్యి వుండి, నిర్వేదం వలన మార్పు పొందాడు. అలా కాకుండా అటువంటి సంఘటన లేకుండా అతను వేదాలు చదివి మారి వుంటే అప్పుడు అది వేదాల గొప్పతనం.అల్రేడి మంచి వెదుకుతు బయలు దేరిన వాడికి , ఆ దారి చూపడం లో సహాయ పడడం ఒక మతం లేక దాని నియమావళి కాదు చెయ్యవలసింది. క్రూరులు, అవినీతిపరులు, అసత్యవాదులు, హింసావాదులు, నీచులని మంచి దారిలో పెట్టగలిగేది గొప్పది.

  ఒక వివరణ: నా వరకు నేను ఏ మతాన్ని గొప్పదని అనుకోవడం లేదు. అలాగే ఏ మతం వలన నాకు కలిగిన నష్టం లేదు, అకారణ ద్వేషం లేదు. నా అభిప్రాయాలు తప్పు కావచ్చు, అంతే గాని ప్రత్యేకం గా ఏ ఒక్క మతాని నేను ద్వేషిస్తున్నాను అని అనుకోవద్దు.

  ReplyDelete
 16. కృష్ణ గారు

  >>ఒక సమాజం ఆచరించిన , చదివిన సూత్రావళి ఆ సమాజాన్ని లోప రహితంగా చెయ్యలేకపోతే.. ఆ సూత్రావళి ఎంత గొప్పదైనా పూర్తిగా లోపరహితం కాకపోవచ్చు

  మీరు చదివిన స్కూల్, కాలేజి చదువు చదివిన వారందరూ మొదటి శ్రేణిలో పాస్ అయ్యారా లేక మిగిలిన శ్రేణులలో కూడా పాస్ అయ్యారా. కొంతమంది ఫెయిల్ కూడా అవుతారు. మీరన్నట్లుగా ఇంజినీరింగ్ చదువు దానిని చదివే ఒక వ్యక్తిని గొప్ప ఇంజినీర్ గా తయారుచేయలేకపోతే అది ఆ చదువు తప్పా. ఆ చదువు చదివే వారు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి దానిని చదవడం నిషేదించాలి లేదా మొత్తం చదవడం మానేయాలి అంటారు అవునా. అందరూ చదివింది ఒకే చదువు అయినప్పుడు, గురువు చెప్పే పాఠాలు అందరికీ ఒకేలా ఉన్నప్పుడు ఫలితం కూడా ఒకేలా ఉండాలి. పాస్, ఫెయిల్ తేడాలెందుకు. అలా పాస్ కానప్పుడు ఆ చదువు వ్యర్ధమే కదా. ఏ విషయాన్ని అయినా అది చదివి లేదా విని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. దానిని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదా చేసుకోకపోవడం ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. విన్నది, చదివినది మంచి సాధన ద్వారా ఆచరణలోకి తేవాలి. అప్పుడు దాని అసలు ఫలితం కనబడుతుంది. ఈ సృష్టిలో ఏది వ్యర్ధం కాదు.

  శ్రీవాసుకి

  ReplyDelete
 17. @ శ్రీవాసుకి గారు,
  చాలా కాలం తరువాత! బాగున్నారా ?

  మీ ప్రశ్న బాగుందండి! చాలా ఆలోచింపచేసింది. ఒక కొత్త కోణం లో నా ఆలోచనలు సాగుతాయని నాకు అనిపించింది, కానీ .. కొన్ని అనుమానాలు ఆపేసాయి. అవి....

  స్కూల్ , కాలేజ్... చదువు.. వేదాలకి కొంత పోలిక వుందేమొ గాని, కొన్ని తేడాలు కూడా వున్నాయి. ఒక విధ్యా సంస్థ.. ఒక ఆర్గనైజిడ్ మతం తో పోలిస్తే బానే వుండునేమో? కానీ హిందుత్వం లో వ్యవస్తీకృత లేదు కదా! ( ఆ ఏర్పాటుకి కూడా లోపాలు వుంటాయి. ఉదాహరణకి.. స్కూలు యజమాన్యం భ్రష్టు పడితే పిల్లల చదువులు పాడయ్యిపోతాయి.)

  ఇక ఇప్పటి చదువులకి .. వేదాలకి పోలిక కూడా .. నాకు కరెక్ట్ అనిపించడం లేదు! ఇప్పటి విధ్యావిధానం పర్‌ఫెక్ట్ అని అనను నేను.. ( మత విధ్య కన్నా బెటరే!)
  జీవితంలో పరీక్షలు వుండవు కదండీ! పాస్ లేక ఫెయిలు అనుకోవడానికి! హత్యలు , దొంగతనాలు చేసెవాడు కూడా తనని తాను రాబిన్ హుడ్ అనుకోవచ్చు. కానీ స్కూలులో ఒక బహిర్గత విధానం లో పెట్టిన పరీక్షలో పిల్లల తెలివి ( ?) పరీక్షిస్తారు కాబట్టి, ఫెయిలు అయినా నేను పాస్ అని అనుకోరు కదా! ( హంతకులు, దొంగలు తాము రాబిన్ హుడ్‌లు అని అనుకున్నట్టు )
  బహుశా మీ ప్రశ్న ఇలా వుంటే బాగుండునేమో? ( మీ ఉద్దేశ్యం ఇది కాదు అనుకుంటే చెప్పండి )
  ఒక ఇంజనీరింగు స్టూడెంటు (మానవుడు ) ఒక సబ్జెక్టులో ( ఎలా జీవించాలి ఈ జీవితం ? ) రెండు అంత కన్నా ఎక్కువ పుస్తకాలలో ఒకటి ఎంచుకోవాలన్నప్పుడు..

  ఆప్షన్ 1) పరాయి భాషలో రాయబడిన , అర్ధం చేసుకోవడానికి కష్టం అయిన , ఆ ఇంజనీరింగు కుర్రాడి స్థాయికి బదులు ఒక సైంటిస్టు కి కూడా అర్ధం కాని విధం లో వున్న పుస్తకం.. అందులో పరస్పర విరుధ్ధ సిద్ధాంతాలు.. సమయ పరీక్ష కి నిలబడకుండా ఈ సిద్ధాంతాలు ఎప్పటికి కరెక్టే అని చెప్పబడీనా ( ఎన్నో సిద్ధాంతాలు పరీక్షకి నిలబడి, ఓడిపోతే కొత్త సిధ్దాంతాలకి దారి ఇచ్చాయి ) పుస్తకం,

  ఆప్షన్ 2) సులభ భాష , అర్ధం అయ్యే తీరులో రాయబడిన, పరస్పర విరుద్ధ అభిప్రాయాలు లేని, సరైన రీతిలో ఆలోచింపచేసె పుస్తకం
  అప్పుడు ఆప్షన్ 2 ఎంచుకోవాలి అని నా ఉద్దేశ్స్యం.

  ReplyDelete
 18. @ శ్రీవాసుకి గారు,


  అప్పుడు ఆ ఆప్షన్ 2 ఎంచుకుంటే విధార్ధి తప్పక పాసు అవుతాడు . చదివే పుస్తకం ఎంపిక కరెక్ట్ కావాలి.
  ఇక స్కూలులో నేర్పే విధ్య అంటారా ? గురువు ఇక్కడ మూలం. కానీ ఒక మంచి గురువు ఎల్ల కాలం వుండడు కదా! అతని తరువాత గురువు స్థానం లో వచ్చినవాడు ఆ స్థాయి లో వుంటాడా? పిల్లలకి సరిగా పాఠాలు చెబుతాడా? చెప్పలేము.
  పోనీ గురువు బదులు ఒక గైడు పుస్తకం ని అనుసరిద్దాము ( కొన్ని మతాలలో గురువు బదులు పవిత్ర గ్రంధం వున్నట్టు..) కానీ ఎల్లకాలం ఆ గైడు మీకు సరి అయిన దారి చూపగలదా! కాలం తో సిద్ధాంతాలు పాతబడతాయి. తప్పు సిద్ధాంతాలు పోయి కొత్త సిద్ధాంతాలు వస్తాయి. మరి అదే గైడు పట్టుకు కుర్చోవడం కరెక్టేనా?

  ReplyDelete
 19. @ krishna
  ##అది చదివి మనకి మంచి దారిన నడవడానికి ప్రేరేపించాలి. ఆ ప్రేరణ ఇవ్వలేకపోతె అది మంచిది ఎలా అవుతుంది? అర్ధం చేసుకుని ఆచరణలో పెడుతున్నామనే చాలా మంది అనుకున్నారు, అది మీకు వారి తప్పుగా కనిపిస్తుంది. నాకు ఆ పుస్తకాల తప్పు అని అనిపిస్తుంది.##

  ఒకే నిప్పుతో వంటా చేసుకోవచ్చు, చేయీ కాల్చుకోవచ్చు. అలాగని నిప్పు మంచిదంటారా?చెడ్డదంటారా? మనం ఆ నిప్పును ఉపయోగించుకొనేదాన్ని బట్టే ఉంటుంది . పుస్తకాల విషయం కూడా అంతేననుకొంటున్నా. చదివినవాడు ఉపయోగించుకొనే విధానం బట్టి అది ఉంటుంది.

  ##కాలం తో సిద్ధాంతాలు పాతబడతాయి. తప్పు సిద్ధాంతాలు పోయి కొత్త సిద్ధాంతాలు వస్తాయి. మరి అదే గైడు పట్టుకు కుర్చోవడం కరెక్టేనా?
  ##

  తప్పు సిద్దాంతాలను వదిలివేద్దాము. మరి అందులో సరైన సిద్దాంతాలు కూడా ఉండి కొన్ని తప్పు సిద్దాంతాలు ఉన్నంత మాత్రాన గైడ్ నే పక్కన పడేస్తే నష్టమే.

  ReplyDelete
 20. @ venkat ji,
  >> ఒకే నిప్పుతో వంటా చేసుకోవచ్చు, చేయీ కాల్చుకోవచ్చు.>>

  నిప్పు లక్షణం మండించడమే గాని, వంట చెయ్యడమో, చెయ్యో కాల్చడమో కాదు కదా!
  ఒక క్రైము థ్రిల్లర్ గురించి మీరు ఉదాహరణగా చెప్పి దానిని హంతకులు, పోలీసులు కూడా వాడొచ్చు అంటే ఒప్పుకుంటాము.
  కానీ వేదాలలో ఒకే విషయాన్ని ఇలా రెండు విధాలుగా చూడలేము కదా! అలా మంచిగా చెడుగా కనిపించే విషయాలు ఏమి వున్నాయి ఏమి లేవు.
  ఆ.. కాకపోతే కొన్ని విషయాలు కాంట్రడిక్టరీగా వుంటాయి. ఈశ్వరవాదం ని చెప్పిన వేదాలలో నిరీశ్వర వాదం వుంటుంది. సంసార ధర్మం ఎలా వుండాలో చెబుతూనే మరొక చోట బ్రహ్మచర్యం గొప్పదని వుంటుంది.
  ఇవి అన్ని మంచి విషయాలే!
  వాటిలో చెడు ఏమిటో నేను చెప్పను ఇప్పటిలో..

  >> తప్పు సిద్దాంతాలను వదిలివేద్దాము. మరి అందులో సరైన సిద్దాంతాలు కూడా ఉండి కొన్ని తప్పు సిద్దాంతాలు ఉన్నంత మాత్రాన గైడ్ నే పక్కన పడేస్తే నష్టమే.>>

  లేదండి , నేను మంచి వదిలెయ్యమని అనడం లేదు. కానీ చెడుని అంగీకరించి వదిలించుకునే ప్రయత్నం చెయ్యాలి అంటున్నాను. ఇలా ప్రతి మతం వాటిలో వుండే చెడు వదిలేస్తే.. నా లాంటి నాస్తికులు కి పని వుండదు. :)

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు