తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Saturday, July 17, 2010

ప్రతి మనిషి ఏ విషయానికి భయపడతాడు?

ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి.

99% మనుషులు ( బహుశా 100% అను కూడా అనుకోవచ్చేమో) ఏ విషయానికి భయపడతారు?

12 comments:

 1. జాతయాస్య మరణం ధ్రువం- కనుక చావుకంటే మనిషి- భవిష్యత్ -ఎలా ఉంటుందో అనే భయంలో నిరంతరం ఉంటుంటాడు.చావు భయం ఉన్నవారు వాసిస్తారామాయణం[వచనం]చదివి అర్ధం చేసుకుంటే చావు ఎంతో హాయిని కలిగిస్తుందో భోధపడుతుంది.

  ReplyDelete
 2. Ignorance/stupidity

  People also fear those who spread stupidity/ignorance. :)

  ReplyDelete
 3. కొటిస్వరులుసైతం" రేపు[భవిష్యత్ ]ఏమౌతుందో అన్న భయంతో" ఉంటుంటారు .మనిషి కలత చెందేది భవిష్యత్ గురించే....

  ReplyDelete
 4. ప్రతి మనిషీ "కొత్త" అనే భావానికి ఖచ్చితం గా భయపడతాడు అని నా ఉద్దేశ్యము. ఎంత ఆత్మవిశ్వాసం గల వాడైనా కొత్త పని అంటే అది ఎలా ఊంటుందో ఏమో అని భయపడతాడు. కొత్త ప్రదేశం లేక కొత్త పరిచయాలు అంటే కొద్దిగా జంకుతాము. దయ్యాలు, భూతాలు అని కూడా భయపడడానికి కారణం వాటిని ఎప్పుడూ చూడలేదు కాబట్టి , వాటితో మనకు పరిచయం లేదు కాబట్టి అవి ఎలా ఉంటాయో అని, ఏం చేస్తాయోనని మన భయం.చావు ఐనా, భవిష్యత్తు ఐనా మనకు తెలియదు అవి ఎలా ఉంటాయో. అంటే అవి కొత్తే మనకు. మొత్తంగా "కొత్త" అనే భావానికి భయపడతాడు అని నా అభిప్రాయమండి.

  ReplyDelete
 5. నాకు నాన్నగారు చిన్నతనంలో చెప్పింది,నాలో ఎప్పుడైనా కలిగే భయాల్ని పోగొట్టుకోటానికి నేను ఎప్పటికీ గుర్తుంచుకునే మాట ఒకటి..."మేం చిన్నప్పుడు(నాకు ఆరేడేళ్ళుంటాయనుకుంటా) పొలంలో పనిచేస్తూ బాగా చీకటి పడింది చూసుకోలేదు...(నాన్న కూడా చల్లపూటైతేనే పని బాగా సాగుతుందని చీకటిపడే వరకు చేయించేవారు)...మా పొలాలేమో ఊరికి రెండు మైళ్ళదూరం...ఎంత త్వరగా నడిచినా చాలా ఆలస్యమైద్ది..దారంతా చెట్లు,గుట్టలు..సన్నటి గడ్డి గట్లమీద నడవాలి..దారిపక్కనున్న గుట్టల్లోంచి ఏవేవో వింత శబ్దాలు,కదలికలు...ఒక్కసారిగా నక్కలు పెద్దగా ఊళ వేశాయ్...నాన్నని గట్టిగా పట్టుకుని," భయమేస్తుంది నాన్నా!" అన్నా...అప్పుడు నాన్న నవ్వుతూ"ఎందుకు భయం? అసలు భయమంటే ఏంటో తెలుసా! మన దగ్గర ఉన్నదేదో పోయిద్దని..ఏమీ లేని మనదగ్గర పొయ్యేది కూడా ఏదీ ఉండదు..అప్పుడు మనకి భయమే లేదు" అన్నారు...అప్పట్నుంచీ ప్రతివిషయాన్నీ ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగుతుంటాను...

  ReplyDelete
 6. కొత్త కు భయపడ్శటమా? అదీ 99% మంది?

  ఐతే మీ బాధకు అర్థం లేదు, అదో ఫోబియా. :)

  కొత్తను వ్యతిరేకించే పాత చింతకాయపచ్చడిలాంటి మనుషులు (ముఖ్యంగా యువత), కొత్తను పాతచేయాలనే పట్టుదల లేని వాళ్ళూ దేశానికి చేటు. అలాంటి రకం గురించి చెబుతూ పుట్టనేమి వాడు గిట్టనేమి అని సుమతి శతకం ఘోషిస్తుంది.

  ReplyDelete
 7. సురేష్ గారు! మీరు చెప్పినది సరైనదే కావచ్చు."క్రొత్త" కి చాలామంది భయపడతారు. ఏదైనా కొత్త ఊరికి పోవాలంటే అక్కడ తెలిసిన వారెవరైనా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. లేకుంటే అక్కడివారెలాంటివారో మనల్ని ఎలా treat చేస్తారో అనే భయం నాకు కూడా చాలాసార్లు వేసింది.

  ReplyDelete
 8. మీరు బాగా గమనిస్తే ప్రతి తరం కొత్తదనం కోరుకుంటారు, దానిని జీవితాలలోనికి ఆహ్వానిస్తారు. ఒక 10 సం|| కాల వ్యవధిలో మనకు ఈ మార్పులు స్పష్టం గా కనిపిస్తాయి. మానవుడు నిజంగా కొత్త దనానికి భయపడితె అది జరుగదు కదా! ఉదా|| సినేమాలనే తీసుకోండి 1960,1970,1980, 1990,2000,2010 ఈ దశాబ్దాల కాలం లొ విడుదలైన సినేమాలలో ఆ మార్పును మనం స్పష్టం గా చూడవచ్చు.
  -------------------------------------------
  నేను అనుకోవటం మనిషి భయపడేది ప్రస్తుతం తన దగ్గర ఉన్నదానిని కోల్పోతమనే విషయం గురించి భయ పడతాడు. ఆ భయం అనేది ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధంగా ఉంట్టుంది. తల్లిదండ్ర్లకు పిల్లలు ఎక్కడ తమ అభిప్రాయాలను వినకుండా ఎదైనా స్వంత నిర్ణయాలను తీసుకొంటే సంఘంలో పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగిస్తారో అని ఒక విధమైన భయం. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఇవ్వవచ్చు.

  ReplyDelete
 9. సురేష్ గారు, మీరు చెప్పింది ముమ్మాటికి కరెక్టే. కొత్తదనాన్ని కోరుకుంటారు. కానీ ఆ కొత్తదనానికి అలవాటు పడే ప్రక్రియలో మొదట భయపడటం సహజమే. మీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు