తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, July 26, 2010

ప్రాచీన భారత ఋషులు ఆఫర్లు పెట్టి సరుకులు అమ్మినారా?

టపా పేరు చూసి ఇదేదో బిజినెస్ కు సంబంధించినది అనుకోకండి.
ఇది నేను ఇంతకు ముందు రాసిన టపా "మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) కంటూ ఒక విధానం ఉంది. విదేశీయుల కళ్ళజోళ్ళతో దాన్నెందుకు చూడాలి?" కి కొనసాగింపు.

రామాయణం లో ఒక శ్లోకం ఉంది. విభీషణుడు రావణుడితో చెప్పే శ్లోకం

సులభాఃపురుషా రాజన్‌ సతతంప్రియవాదినః

అప్రియస్యతుపథ్యస్య వక్తా శ్రోతాచదుర్లభః

అర్థం:
రాజా! నిత్యం ప్రియమైన మాటలు చెప్పేవారు సులభంగా లభిస్తారు. కాని మన మనసుకు నచ్చకపోయినా మన మేలు కోసం చెప్పేవారూ, చెప్పినా వినేవారూ దొరకడం కష్టం.


కాని అందరికీ మంచిది అవుతుంది అన్న విషయం చెప్పితీరాలి. చెప్పినా వినేవారు దొరకడం కష్టం. ఇక్కడే మన ప్రాచీనఋషులు ఆలోచించారు. నేటి వ్యాపారస్థులు తమ సరుకులు అమ్ముడుపోవడం కోసం "ఒకటి కొంటే ఇంకోటి ఉచితం" లాంటి పథకమే ఆ ఆలోచన.

చెప్పాల్సిన విషయం లేదా సందేశం సరుకులాంటిది. ఆ విషయాన్ని లేక సందేశాన్ని కల్గి ఉన్న కథ ఆఫర్ లాంటిది. అంటే అసలు సరుకు చెప్పాల్సిన విషయం, కథ ఆఫర్ అన్నమాట. సరుకు అమ్ముడు పోవడం కోసం వ్యాపారి ఆఫర్ ఇస్తాడు. జనంలో చాలా మంది మళ్ళీ ఇలాంటి ఆఫర్ ఉండదేమోనని సరుకు కొంటారు. ఇది అందరికీ తెల్సిన విషయమే. కొందరైతే ఆఫర్ ఉంటేనే సరుకులు కొంటారు. ఎలాగైనా సరుకు అమ్ముడుపోవడం అనేది వ్యాపారికి ఎలా ముఖ్యమో, మంచి విషయం ప్రజలకు అందాలనేది ఋషి ఉద్దేశ్యము.

మనము సరుకు కొన్న తర్వాత అసలు సరుకు చూపించకుండా ఆఫర్లో వచ్చిన సరుకునే ఎక్కువగా పక్కింటివారికి లేక మరెవరికో ఎలా చూపిస్తామో కథలోని సందేశాన్ని కాకుండా కథనే ఎక్కువగా
పట్టించుకొంటాం. అది వేరే సంగతి.

సరే కథ చదివినంత మాత్రాన సందేశం అందుతుందా అంటే సందేహమే. ఇక్కడే మరో ఆలోచన వచ్చింది ఋషులకు.

మనిషి విన్నదాని కంటే చూస్తే ఎక్కువ గా ఆకర్షితుడవుతాడు.

కాబట్టి నాటకాలలో సందేశాలను జొప్పించి నాటకాలు వ్రాశి వాటిని ప్రదర్శిస్తే చూస్తున్నంతసేపు తనను తాను మరిచిపోతాడు. పాత్రలను మరిచిపోయి వాటిని నిజంగా భావించి అందులో లీనమవుతాడు.

బయటకు వచ్చినా ఆ ప్రభావం పోదు. నేటి సినిమాలు, సీరియళ్ళ లో ఈ విషయాన్ని బాగా గమనిస్తూనే ఉన్నాం కదా.

6 comments:

 1. చక్కటి ఎనాలోజి. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

  ReplyDelete
 2. కాని ఒకటి కొంటే రెండోది ఫ్రీ అనేది అమ్ముకోవడం. కాని ఋషులు అలా తెగబడి అమ్ముకున్నారంటే నేను నమ్మలేకుండావున్నాను.

  ReplyDelete
 3. @ snkr

  I think vibishana told us that sloka pointing ravana.

  ReplyDelete
 4. మనకు తెలిసినది ఇంకొకళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా బాగు పడుతారు కదా, వాళ్లకి ఏ విధముగా చెప్పటము అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశము అను కుంటాను.

  ReplyDelete
 5. అమ్ముకోవడమంటే ఇచ్చినదానికి తిరిగి మరేదో ఆశించడం. ఆ పని ఒకవేళ వారు చేసి ఉంటే అది అమ్ముకోవడం అనచ్చు - కర్ణుడు, మదర్ తెరీసా, స్వామీ నిత్యానంద తరహాలో. కానీ ఏదీ ఆశించకుండా - "ఒకటి వింటే రెండోది ఫ్రీ" అంటూ చేసేదానిని అమ్ముకోవడం అనరేమో?

  ReplyDelete
 6. on a lighter side,
  >> రాజా! నిత్యం ప్రియమైన మాటలు చెప్పేవారు సులభంగా లభిస్తారు. కాని మన మనసుకు నచ్చకపోయినా మన మేలు కోసం చెప్పేవారూ, చెప్పినా వినేవారూ దొరకడం కష్టం.>>

  i think i am also trying to tell some thing similar but few are ready to listen..hahaha

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు