తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, July 15, 2010

దేశభక్తి అంటే అవసరమైనప్పుడు మాత్రం చూపేదా? లేక మనలో జీర్ణించుకు పోయుండాలా?

ఇప్పుడు ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్య చదివిన ఒక సంఘటన విషయం నన్ను ఎంతగానో స్పందింపజేసింది.

అదేమిటంటే ఒకసారి స్వామి రామతీర్థ జపాన్‌లో పర్యటిస్తూ అందులో భాగంగా రైలులో ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణిస్తున్నాడు.స్వామికి మధ్యలో ఆకలి అయ్యి పండ్ల కోసం ఒక స్టేషన్‌లో దిగి పండ్ల కోసం వెదికాడు.కాని ఎక్కడా దొరకలేదు. అలానే రైలు ఆగిన మరో మూడు స్టేషనులలో ప్రయత్నించాడు కానీ దొరకలేదు.

ఇదంతా గమనిస్తోన్న ఎదుటి సీట్‌లో కూర్చొని ఉన్న ఒక జపాన్ కార్మికుడు రైలు మరో స్టేషనులో ఆగుతుందనగా రైలు ఆగీఆగకనే దిగివేసి బయటకు పరుగెత్తుకు వెళ్ళి పండ్లు కొనుక్కొనివచ్చి రామతీర్థ గారికి ఇచ్చాడు.రామతీర్థ గారు "ఎందుకంత కష్టం తీసుకొన్నావు?" అంటూ డబ్బు అతని చేతికి ఇవ్వబోగా అతను తీసుకోవడానికి నిరాకరిస్తూ ఒక్క మాట మాత్రం అన్నాడు.
"స్వామీ! మీరు జపాన్ నుండి భారతదేశమునకు తిరిగవెళ్ళిన తర్వాత అక్కడ మీరు జపాన్ లో కనీసం తినడానికి కూడా పండ్లు దొరకలేదని అనకండి.అందుకే నేనిలా చేసాను.అదే మీరు నాకు ఇచ్చే పదివేలు" అన్నాడు.
ఒక చిన్న విషయం దగ్గర కూడా జపాన్ వారి దేశభక్తి ఎలా వెల్లడైందో గమనించారా?

ఇక మన విషయానికి వద్దాం.మనకు దేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడో కానీ లేక ఎక్కడో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడో కాని దేశభక్తి అన్నది గుర్తుకురాదు.

పై సంఘటనలో లాగా మనలో ఎంతమందికి నరనరానా దేశభక్తి జీర్ణించుకుపోయింది?
మనకు ఏదైనా పెద్ద సంఘటన జరిగితే దేశభక్తిని ప్రదర్శిస్తాము తప్ప మన నిత్యజీవితములో దానిని నిజముగా పాటిస్తున్నామా?

మనదేశము లోని కొన్ని కామకుక్కలు ఎంతగా దిగజారి పోయాయంటే మనదేశానికి వచ్చే విదేశీ పర్యాటక మహిళలను బలాత్కరిస్తున్నారు.డబ్బు కోసం ఆ పర్యాటకుల వద్ద యాచిస్తున్నారు.ఎంత చులకన? దీనివలన దేశానికి అంతర్జాతీయముగా ఎంత తలవంపులు వస్తున్నాయో మనకు తెలుసు.దేశభక్తి నిజముగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటారా?

ఈ టపా మనలోని డొల్లతనాన్ని విమర్శిస్తూ వ్రాసిందే కానీ నరనరానా దేశభక్తి నింపుకొన్న సైనికులను,పౌరులను ఉద్దేశించి వ్రాయలేదని గమనించగలరు.

26 comments:

 1. మీరు మొదటి చెప్పిన దేశభక్తికి కట్టుబడే వాళ్ళున్నారు ఇంకా.. అలాగే కాముకులూ ఉన్నారు..ఇక్కడా ..ఆ జపానులో.. కాకపోతే కామానికి దేశమూ ప్రాంతము ఉండవండీ..
  డబ్బులున్నవాడు విటుడు అవుతాడు..లేనివాడు రేపిస్ట్ అవుతాడు ..కోరిక కామన్..
  నిజాలు మాట్లాడుకుంటే అలా డ్రెస్ వేసుకుంటే ఎవరికీ మాత్రం మూడ్ రాదు..
  దీన్ని మీడియా గోరంతలు కొండతలు చేసి.. మీరన్నట్లు ఆ ఇతర దేశాల ముందు -------- చేస్తుంది.. ఇప్పుడు మీరు మరియు మీ పోస్ట్ రిప్లై ఇచ్చి నేను కొండకి రంగు వేస్తాన్నాము అంతే....

  ReplyDelete
 2. రాజేష్ గారూ! ఇందులో చెప్పిన సంఘటన రామతీర్థ గారి జీవితచరిత్రలో చదివానండీ. ఏ పత్రికలో కానీ మరే ఇతర మీడియా లో నుండి కానీ తీస్కోలేదు.

  ReplyDelete
 3. @ రాజేశ్
  ఎలాంటి డ్రెస్ వేసుకుందేంటి ఆ అమ్మాయి? అలా డ్రెస్ వేసుకుంటే నిక్షేపంగా రేప్ చేసిపడెయ్యొచ్చన్నమాట! బాగా చెప్పారు. నాకు నచ్చింది.

  ReplyDelete
 4. @సురేష్ గారు,
  మొదటి సంఘటన జీవిత చరిత్ర లో అయి ఉండవచు.. కాని రెండవది మీ బాధకు ఈ వ్యాసం వ్రాయడానికి కారణం అయింది అనుకున్తున్నాను..

  ఇక మీడియా గురించి
  ఒక సంవత్సరం ముందు అనుకుంట, ఒక ఫ్రెంచ్/రష్యా అమ్మాయిని ఎవరో గోవాలో రేప్ చేసి చంపారు.. అంతే.. ఇంకా పొద్దున్న లేస్తే మీడియా లో అదే వార్త.. ముఖ్యంగా ఇంగ్లీషు మీడియా లో.. తాన అంటే తందానా అని తెలుగు మీడియా..
  కాని అది ఫస్ట్ టైం కాదు..ఇక గోవా కల్చర్ ఎలాంటిదో తెలియంది కాదు..పబ్స్ విత్ డ్రగ్స్ అండ్ సెక్స్... అలాంటిచోట జరిగితే అంతే సీన్ అవసరమా


  @శరత్,
  మీరు ఎలా అర్థం చేసుకున్న పర్లేదు.. ఆచరణలో పెట్టకండే.. బొక్కలో తోస్తారు..
  కాకపోతే నేను చెప్పేది ఏంటంటే,
  ఒకడు పది రూపాయలు పెట్టి సినిమా కి వెళ్తాడు..అదే సినిమాకి వంద రూపాయలు పెట్టి ఉన్నవాడు వెళ్తాడు.. ఇక ఆ సినిమాలో చూపించే మసాలా ఇద్దరిని టెంప్ట్ చేస్తుంది.. ఉన్నవాడు డబ్బు పెట్టి -------కొంప కెళితే.. లేనివాడు టైం కోసం ఎదురు చూస్తాడు.. అప్పుడే ఇలాంటివి జరుగుతాయి . ఇది ఉదాహరణక మాత్రమే... అలాగే పీస్ డ్రెస్ ల విషయంలో కూడా.. చూసిన ఒక్కోరి ఆలోచనలు ఒక్కో విధముగా.. ఒకడు ఆధునికం అనుకుంటే .. ఇంకొకడు కసక్కు అనుకున్టాడు.. ఎవరిదీ తప్పు?


  నేను ఇక్కడ చివరకు చెప్తుంది .. సురేష్ గారు అంతగా విదేశీయుల మన గురించి ఏదో అనుకుంటారని బాధపడనక్కర్లేదు అని... వాళ్ళు చాలా లైట్ గా తీసుకుంటారు ఇలాంటివి..

  ReplyDelete
 5. @ రాజేష్
  "అలాగే పీస్ డ్రెస్ ల విషయంలో కూడా.. చూసిన ఒక్కోరి ఆలోచనలు ఒక్కో విధముగా.. ఒకడు ఆధునికం అనుకుంటే .. ఇంకొకడు కసక్కు అనుకున్టాడు.. ఎవరిదీ తప్పు? "


  ఎవరు ఎలా అనుకున్న ఫర్వాలేదు కానీ ఎవరయితే రేప్ చేస్తారో వాడిది తప్పు!

  "అంతగా విదేశీయుల మన గురించి ఏదో అనుకుంటారని బాధపడనక్కర్లేదు అని... వాళ్ళు చాలా లైట్ గా తీసుకుంటారు ఇలాంటివి.."

  ఇది పొరపాటు అవగాహన. వాళ్ళు స్వేఛ్ఛగా మసిలినంత మాత్రాన బలవంతపు శృంగారాన్ని సహిస్తారని కాదు. మీకు ఇక్కడి స్వేఛ్ఛ గురించి మాత్రమే తెలిసినట్లుంది కానీ ఆ స్వేఛ్ఛ వెనుక ఎంతటి కఠినమయిన చట్టం గట్టిగా పనిచేస్తుందో మీకు ఐడియా లేనట్లుంది.

  ReplyDelete
 6. అంతే కాని అలా చూపించిన వాళ్లది కాదు అన్న మాట...సరే మరి అది మీ అభిప్రాయం..

  నేను చెప్పింది .. ఇక్కడేదో(ఇండియా లో) జరిగి౦దని అక్కడి విదేశీయులు అంతగా పట్టించుకోరని... మన మూర్కపు మీడియా తప్ప . అంతేగాని రేప్ చేస్తే ఇష్టపడతారాని గాదు.

  కాని మితిమీరిన స్వేచ్చ ఎప్పుడు అనర్ధాలకే దారితీస్తుంది..ఈ లండన్ లో రోజుకో రేప్ న్యూస్ పేపర్లో కనిపిస్తుంది..

  అందువల్ల, ఇండియా లో ఉన్నప్పుడు వాళ్ళ లిమిట్స్ లో వాల్లు ఉంటె ప్రాబ్లం ఉండదేమో..

  ఈ టాపిక్ రేప్ మీదకి వెళ్ళకుండా, అసలు పాయింట్ .. విదేశీయులు నిజంగానే
  మన గురించి చెడు గా అనుకున్తున్నరా? ఒక వేళ అనుకుంటే మనం ప్రతిస్పందించాలా? దీని మీద మాట్లాడితే బావుంటది అనుకుంటున్నా..

  ReplyDelete
 7. సురేష్ బాబూ! మనం ఇంటిలో ఉన్నప్పుడెలాగున్నా ఇంటి నుండి బైటకి వెళ్ళేటప్పుడు సామాజిక కట్టుబాట్లనీ; ఆత్మ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశుభ్రంగా వెళ్ళటం లేదా? అలాగే మనవాళ మధ్య ఉన్నప్పుడైతే మనం చనువుగా మాటాడడం లాంటివి చేసినా పై వారి దగ్గరమాత్రం చాలా అచి తూచి మాటాడుతాం. అది ప్రతీ ఒక్కరికీ చెప్పకుండా వచ్చే ఇంగిత జ్ఞానం.
  మీరన్నాట్టు కామాంధులకీపాటి ఇంగిత జ్ఞానం కూడా లేదంటే వారికెంతటి కఠిన శిక్ష వెసినా తక్కువే ఔతుంది.చక్కని విషయాన్ని వ్రాసావు. అభినందనలు.

  ReplyDelete
 8. @rajesh./--be a roman when u r rome,i agree friends but we indians in westren countries r all were wearing their costumes[esply our woman]?dressing is ones personal taste,according to their taste,they will wear the dress,which is comfortable to them.if one looses his balance by mere seeing a womans dressing,there is no difference btwn a street dog nd to that person--jayadev/chennai-17.

  ReplyDelete
 9. As per my experiences,in india,patriatism confined to august-15th nd republicday only--jayadev.

  ReplyDelete
 10. As per my experiences,in india,patriatism confined to august-15th nd republicday only--jayadev.
  చక్కగా చెప్పారు జయదేవ్ గారు..

  మీరు వీధి కుక్క అనండి.. ఊర ప౦ది ఆనండీ.. కాకపోతే పరిస్తితులకి మూల కారణం చెప్పా.. అందరు మనస్సును ఎప్పడు కంట్రోల్ చేసుకోలేరూ...

  ReplyDelete
 11. @ సురేష్ గారు,
  ఆ జపాన్ కార్మికుడు చేసింది దేశభక్తి అన్న మాట! నాకు మరి ఎందుకు అది నిజాన్ని దాయడం అనిపిస్తుంది చెప్మా? అమెరికా ప్రెసిడెంట్ మన దేశానికి వస్తున్నాడు అంటే మన రోడ్లు వగైరా తళతళలాడిస్తు మనం చేసె నాటకం దేశ భక్తి అన్న మాట ( తమ దేశాలు బహు చక్కగా వున్నాయి అని ఎదుటి వారికి చూపించే ప్రయత్నం.. పోలిక అర్దం కాని వారి కోసం.. )

  @ జయదెవ్ గారు
  ఇక పోతే మాన భంగాలు చేసెవారి గురించి.. వస్త్రధారణ చూసి సంస్కారం మరిచిపోయే వీధి కుక్కలదే తప్పు... కానీ ఆ వీధి కుక్కలని తయారు చేస్తుంది ఎవరు ? పుట్టుక తోనె వారు అలా వీధి కుక్కలా? లేక మన పద్ధతులు ఏమన్నా వారిని అలా తయారు అయ్యేటట్టు చేస్తున్నాయా? రజస్వల అయ్యాక అబ్బాయిల తో అమ్మాయిలు తిరగకూడదు.. అమ్మాయిలు వంక కన్నెత్తి చూసే వాడు తిరుగుబోతు.. ఇలా బ్రెయిన్ వాష్ చేసెది ఎవరు ? అమ్మాయికి అబ్బయిలు అంటే బ్రహ్మ రాక్షసులుగా, అబ్బాయిలకి అమ్మాయిలు బ్రహ్మ పదార్ధంగా .. నూరి పోసి అవసరం అయ్యిన దానికన్నా ఎక్కువ దూరం పెట్టడం అనవసరపు అలోచనలకి కారణం కాదా ? అవకాశం లేనపుడు సంస్కారవంతులుగా చలామణి అయ్యే పిల్లలని చూసి పొంగిపోయే తల్లి తండ్రులది తప్పు కాదా? నిగ్రహం సంస్కారం ఇలా కాదు కదా వచ్చేది ?

  ReplyDelete
 12. @ రాజేష్ గారు,
  మనం మనస్సుల్లో ఎలా అనుకున్నా పర్లేదు.. మనకి నచ్చినట్టు వుండడం తప్పు కాదు, కాకపోతే మన స్వేచ్చా స్వాతంత్రాలు ఎదుటి వారి ముక్కు కొన వరకే అని గుర్తు పెట్టుకోవాలి, అప్పుడు చౌక బారు సినిమాలు, 2 పీస్ బట్టలు ఎంత రెచ్చగొట్టినా ఇలా చిత్తకార్తె పనులు ఏ కుక్కలు చెయ్యవు.

  ReplyDelete
 13. కృష్ణ గారూ! జపాన్ లో పళ్ళు ఎందుకు దొరకవు చెప్పండి. ఆ రోజు రామతీర్థ గారికి దొరికుండవు. ఇక్కడ నిజం దాచడం ఏముంది చెప్పండి. ఐనా ఒక సామాన్య కార్మికుని కి కూడా దేశం పట్ల అంత భక్తి ఉండడం మేలే కదండీ. మన వారికి లేదని కాదు, చిన్నచిన్న విషయాలలో కూడా కల్గిఉంటే బాగుంటుంది కదా.

  ReplyDelete
 14. @ సురేష్ గారు, జపాన్ లో పళ్లు దొరకవని కాదు నా ఉద్దేశ్యం.. ఈ కధ నేను కూడా చదివాను, కాకపోతె నాకు అనిపించింది ఏమిటి అంటే..రామతీర్ధ గారికి రైలు ప్రయాణం లో ప్లాట్‌ఫారం మీద పళ్లు కనిపించవు, అప్పుడు ఆ కార్మికుడు రైలు ఆగక ముందే దూకి, బయటకి వెళ్లి పళ్లు తీసుకు వస్తాడు. అది అతిథి మర్యాద అయితే నేను కూడా హర్షించేవాడిని, కానీ తమ దేశంలో ప్లాట్‌ఫారం మీద పళ్లు కూడా కనిపించవన్న ఉద్దేశ్యం పరాయి దేశం కి చేరకూడదన్న తపన మాత్రమే కనిపిస్తుంది. అది మరి ఒక అభిప్రాయాన్ని ప్రభావితం చేసె ప్రయత్నం లా నాకు కనిపియ్యడం తప్పు కాదేమొ ? పరాయి దేశపు అధ్యక్షులు వచ్చినప్పుడు మన రోడ్లు హఠాత్తుగా తళతళలాడించడం కూడా ఇలా ఒక అభిప్రాయాన్ని ప్రభావితం చేసె మోసపూరిత చర్యనే!

  ReplyDelete
 15. //రోడ్లు హఠాత్తుగా తళతళలాడించడం కూడా ఇలా ఒక అభిప్రాయాన్ని ప్రభావితం చేసె మోసపూరిత చర్యనే!//
  ఇందులో నాకు మోసపూరిత చర్య ఏమిటో అర్థం కాలేదు. ఒకరోజైనా రోడ్ క్లీన్ అవుతుందికదా అని సంతోషిస్తాను. పూర్వం చేసేవారు , ఈమధ్య అది కూడా ఎవరు చేస్తున్నారు గనక.

  సురేష్
  మీరడిగిన ప్రశ్నకు నా చాయిస్ అవరమైనపుడు చూపితే చాలు, అనవసరంగా చీటికీమాటికీ జండా పట్టుకుని ఆవేశంగా వూపక్కరలేదనుకుంటా. మరీ జీర్ణించుకుపోయినా లాభంలేదు, విసర్జించాల్సి వస్తుంది కాబట్టి! :)

  ReplyDelete
 16. @కృష్ణ గారు,
  మీ పోస్ట్ లు బోడి గుండుకి మోకాలుకీ ముడిపెట్టినట్లున్నై... ఇంతకీ మీ ఏడుపు దేనిమీద .. మన సంప్రదాయాల ఫైనేనా?... అదే పిల్లల్ని పెంచడం... నాకు తెలిసి ఇప్పుడు అలా ఎవరు పెంచడం లేదు.. నేను ఎప్పుడు వినలేదు కూడా.. ఒకవేళ పెంచిన మీరన్నట్టు చూడొద్దు అంటే చూస్తారు .. అంతే గాని రెప్ చేయరు గద...రెండింటికి లింక్ లేదండి... ప్రస్తుత్ కాలంలో మాట్లాడ౦డి.. ఎప్పుడో ఏవో జరిగాయని విషం కక్కనక్కర్లీదు.. మరి ఇంకా ఇతర దేశాలలో జరిగే రేప్ ల కి కారణం కుడా ఇదేనా?

  సినిమా ఒక ఉదాహరణ.. నేను చెప్పి౦ది ఒక సామాన్యుడు అలంటి పరిస్తితుల్లో ఎలా ప్రవర్తిస్తాడో చెప్పాను...అది నిజం.. ఈ రేప్/హత్యలు/మరే చెడు కాని క్షణకాలంలో మనిషి ఉచ్చనీచాలు మరిచి చేస్తే జరిగేవి..
  దీనికి మూల కారణ౦ వెదికితే బావుంటది.. నీను చెప్పింది ఒక కారణం..

  @

  ReplyDelete
 17. చాలా కొత్త టపాలు వస్తాన్నాయి.. ఇక ఈ టపాకి సెలవు..

  ReplyDelete
 18. కృష్ణ గారు! మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి. వారి బలహీనతలతో సహా వారిని స్వీకరిస్తాము కదా. మనకు ఆ బలహీనతలు ఏంటి అనేవి మనకు, మనం ప్రేమించినవారి మధ్యనే ఉండేందుకు శతవిధాల ప్రయత్నిస్తాము కదా. బయటికి పొక్కకుండా చూస్తాము. ఇదంతా మనకు వారిపై ప్రేమ ఉన్నందువలనే చేస్తాము.అలానే దేశం పై ప్రేమ ఉన్నప్పుడు కూడా చేయాలని నా ఉద్దేశ్యము,అభిప్రాయము.ఎందుకంటే దేశాన్ని ప్రేమిస్తున్నాము కాబట్టి.అందుకే జపాన్ కార్మికుడి చేష్టలో నాకు అతని దేశభక్తి కనిపించింది. లోపాలు లేనివంటూ ఉండవు. ఏ లోపాన్నైనా మనం మనం చర్చించుకొని పరిష్కరించు కోవాలి అని నా అభిప్రాయమండీ. దాన్ని బయటివారికి చూపించనవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం.

  ReplyDelete
 19. @ సురేష్ గారు,
  మనం రాగ ద్వేషాలకి అతీతంగా వుండాలి అన్నది తప్పా? మన వారు తప్పు చేస్తె / వారిలో లోపం వుంటే దాయడం కరెక్టేనా ? నా వరకు తప్పు అనిపించి అలా అన్నాను.

  ReplyDelete
 20. ఒక కుటుంబం లో లోపాలు ఉంటే ఆ కుటుంబంలోని వారే ఎలా చర్చించుకొని పరిష్కరించుకొంటారో, బయటివారికి తెలియనివ్వరో అలానే మన దేశపు సమస్యలు కూడా పరిష్కరించబడాలి. మన వారు తప్పు చేస్తె / వారిలో లోపం వుంటే మనమే చుసుకొందాం.పరిష్కరించుకొందాం. బయటివారికి చెప్పనవసరం లేదు కదా!

  ReplyDelete
 21. గల్ఫ్ దేశాల్లో భారతీయుల అగచాట్లు,ఆస్ట్రేలియాలో భారతీయులకు అవమానం,అమెరికా గురుద్వారాలో కాల్పులు లాంటి బాధాకరమైన వార్తల నేపధ్యంలో ఒకసారి ఆలోచిద్దాం;
  “కొంతమంది ఎక్కువ జీతం వస్తుందని విదేశాలకు వెళుతున్నారు.అక్కడ నెలకు ఐదు వేల డాలర్లు సంపాదించవచ్చు.ఇండియన్ కరెన్సీ తో పోల్చుకుంటే అది ఎన్నో లక్షలౌతుంది .కానీ అక్కడ ఆ దేశానికి ఎంత ఆదాయమో ఇక్కడ ఈ దేశానికి అంత నష్టం.అక్కడ అయిదు వేల డాలర్లు సంపాదించే బదులు ఇక్కడ ఐదు నూర్లు సంపాదించినా చాలు మనకు.ఈ సత్యాన్ని గుర్తుంచుకొనలేక అనేకమంది అనేక రకములైన ఆశలు పెంచుకొని విదేశాలకు పోతున్నారు.కానీ ఎబ్రాడ్ లో ఏముంది?బ్రాడ్ నెస్ (విశాల భావం) మీలోనే ఉంది.దానిని వదిలి పెట్టి మీరు అబ్రాడ్ పోవటం చాలా పొరపాటు.మీరు విదేశాలకు పోనక్కరలేదు.ఇక్కడే ఉండి మీ తల్లి దండ్రులను సేవించండి. భారతీయ సంస్కృతిని మీ బిడ్డలకు నేర్పండి “అని సత్య సాయి చెప్పాడు.15.1.2008.(సనాతన సారధి మార్చి 2008)

  ఇప్పుడు 32 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఊడిగం చేస్తున్నారు.మిగతా దేశాల్లో ఇంకెంతమంది ఉన్నారో! అవకాశం వస్తే విదేశాలకు ఉరకాలని లక్షల మంది కాచుకొని ఉన్నారు.వీళ్ళంతా మన దేశంలోనే ఉండి మన ప్రజలకే సేవ చేసే పరిస్థితి మన ప్రభుత్వం,మన పారిశ్రామిక వేత్తలూ కల్పిస్తే విదేశాల తలదన్నేలా మన దేశం అభివృద్ధి చెందదా?మన మాతృభాషలు ఇలా మరణ శయ్యమీదకు చేరుతాయా? అన్ని భాషలూ ఇంగ్లీషు దెబ్బకు చచ్చి పోతున్నాయి. భారతీయ సోదరులారా, ఎన్నో శతాబ్ధాల పాటు నిర్మించుకున్న మన సాహిత్యం ,దేశీయ జన విజ్నానం మట్టిపాలు కానీయవద్దు.మీ దేశ భక్తి ,భాషాభిమాన కబుర్లు ఆపి ఈ ఒక్క సాయి సలహా పాటించండి చాలు. పదేళ్ళలో మళ్ళీ మన భాషలు ప్రాణం పోసుకొని తిరిగి జనశక్తితో తప్పక లేస్తాయి. మన భాషలు బ్రతకాలంటే ఇలా చెయ్యక తప్పదు.
  ‘మాతృభాషను మాతృభూమినీ దేశ పౌరుల్నీ ప్రేమించటమే నిజమైన దేశభక్తి ‘ విదేశాలలో మన దేశ ఘన కీర్తులు చాటుతున్న భారతీయ వీరులారా లేవండి.పల్లవి మార్చండి.మాతృదేశమే మాకు అమర దైవతము అనండి.భారతీయత లేని బ్రతుకును ఆశించకండి.భరత గడ్డమీదకు తరలి రండి.మనదేశ ప్రజలకే సేవ చెయ్యండి.

  ReplyDelete
 22. Dear friend,You have understood the concept of swami vivekananda...and his practicality along with his spiritual thoughts...that's enough....murthy

  ReplyDelete
 23. Intha mandi deshabhakthulunnarani,bhaaratheeyatha gurinchi intha goppa maatalu chepputhaarani nenu enaadu anukoledu.evariki vaaru jeevisthu pothunnaru ani anukuntunnanu kaani intha mandi deahabhakthi gurinchi maatlaadatamu naaku chaala santhonni isthundi.
  kachithamuga mana bhaarathadesha repu raaboye rojulalo avineethi leni deshamuga untundhi ane namaakamu naaku kaluguthundi.
  aithe,okamaata, vesukune battalanu batti kaama korkelu kaluguthuntai anedi vaasthavamu kaadu, chooche kallanu batti mariyu aalochinche manasunu batti korkelu kaluguthai idi vaasthavamu.
  pedda pedda godalu kattabadina kotanu pattukune oka raaju kante , thana manasunu,vaati aalocvhanalanu thana aadheenamulo vunchukone vaadu goppa vaadu.
  kaabatti mana manasunu mana swaadheenamulo unchukundhamu.
  Bharatheeyathanu preminchu vaarikandariki naa namaskaaramulu.
  Bhaaratha deahamu naa maathru bhoomi,bhaaratheeyulantha naa sahodharulu.nenu naadeahamunu preminchuchunnanu.

  ReplyDelete
 24. @rajesh.g
  kaama thuraanaam na bhayam na lajja.
  kaamamtho kallu moosukupoyina vaaniki bhayamu undadu siggu lajja undavu
  dresslu vesu kuntene mood vachevaadu nijanga vaadu chitthakaarthe kukane.vaadiki vaavi varasalu vundavu.aithe alaa jarugu thunnadi dressla valana kaadu,vaadi manasulo kaama korkelu bhayataku rapela rupamlo bhayataku vasthunnai anthe.
  dresslaku rapelaku mudi pettakandi.

  ReplyDelete
 25. పరాయి వారిని పైకెత్తేసి మనల్ని మనం కించ పరచుకోవడం ఓక ఫ్యాషన్ అయిపొయింది. ఇదే మన మెదళ్ళకు పట్టిన పెద్ద రోగం.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు