తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, July 7, 2010

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?

క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.

1.అక్షరలక్ష:ఈ గ్రంథం ఒక ఎన్‌సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

2.శబ్దశాస్త్రం:రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.

3.శిల్పశాస్త్రం:రచయిత కశ్యపముని.ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి.ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు,మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

4.సూపశాస్త్రం:రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు,పిండివంటలు,తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి,ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

5.మాలినీ శాస్త్రం:రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

6.ధాతుశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.మిశ్రలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

7.విషశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం): రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి.సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు.ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.

9.మల్లశాస్త్రం: రచయిత మల్లుడు.వ్యాయామాలు,ఆటలు,వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.


10.రత్నపరీక్ష: రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం,బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.

11.మహేంద్రజాల శాస్త్రం:సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

12.అర్థశాస్త్రం:రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.

13.శక్తితంత్రం: రచయిత అగస్త్యముని.ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

14.సౌధామినీకళ:రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

15.మేఘశాస్త్రం: రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

16.స్థాపత్యవిద్య:అదర్వణవేదం లోనిది.ఇంజనీరింగ్,ఆర్కితెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సాముద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు.

16 comments:

 1. నిజమే ఆశ్చర్యం కలుగక మానదు, కాని మీరే చెప్పినట్టు చాలా వరకు అందుబాటులో లేవు కనుక తెలియకుండా పోతుంది. కేవలం విషయ సూచిక మాత్రమే అందుబాటులో ఉంటే మా తాతలు నేతులు తాగిన చందంగా ఉంటుంది. మనం దాని గురించి చెప్పుకుంటు తిరుగుతే నిజంగానే చూసేవాళ్ళకి ఆశ్చర్యంగానే ఉంటుంది, అన్ని తగల బెట్టి ఇప్పుడు ఫిడేలు వాయించుకుంటున్నాం అని.

  ReplyDelete
 2. ఇవన్నీ ఎక్కడున్నాయో అడ్రస్ చెప్పండి ప్లీజ్!

  ReplyDelete
 3. పోయినవి సరే
  ఉన్నవాటిని చదవాలనే ఆసక్తి మాత్రం ఉందా ? అది చదవాలంటే సంస్కృతం నేర్చు కోవాలి . ఆసక్తి ,ఆ ..శక్తి లేక మనజ్ఞాన సంపదను మనం అవహేళన చేసుకునే దౌర్భాగ్యం లో ఉన్నాము . కనీసం జర్మనీ లాంటి విదేశాల లోని విజ్ఞానవేత్తలు సంస్కృతం ఎందుకు నేర్చుకుంటూన్నారో ఇక్కడున్న అద్భుత విజ్ఞానాన్ని గూర్చి ఎందుకు పరిశొధనలు చెస్తున్నారో కుహనమేధావులకు అర్ధం కాదు .

  ReplyDelete
 4. అవునండి..మన వేదాల్లో , ఉద్గ్రంథాల్లో ఉన్న జ్ఞానం లో అణువంతైనా మనకు తెలీదు .. సముద్రం లోని విలువైన ఆణిముత్యాలు కావాలంటే ఒడ్డున కూచుని అవసలు లేనే లేవు అని తీర్మానించే వారికి ఏమి లభిస్తాయి..అలాగే మనకున్న జ్ఞానసంపద లోతులకు వెళిటే కాని లభిచదన్నడి మాత్రం నిజం..సురేష్ గారు..హాట్సాఫ్ .. మీ పోస్ట్స్ నిజం గా చాలా ఉత్తేజభరితం గా ఉంటున్నాయి..కీప్ గోయింగ్..

  ReplyDelete
 5. 11.మహేంద్రజాల శాస్త్రం:సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది/సుధీర్ జి ..నీరు/గాలిలో తేలే విద్యలు గారడీలు కావు.ఇవి మహేంద్రజాల శాస్త్రంలోనివి కావు.ఏ రెండు విద్యలను పారమార్ధిక విద్యలంటారు .ఆంగ్ల భాషలో ఇవి పారాసైకాలజి,కిందకి వస్తాయి.వీరబాహువు కేవలం ఇంద్రజాలవిద్య గురుంచి మాత్రమే వ్రాసారు.నీరు/గాలిలో తేలే విద్యలు పతంజలి యోగ-శాస్త్రం లోనివిగా గుర్తిమ్పగలరు./13.శక్తితంత్రం: రచయిత /కణాదుడు.అస్వశాస్త్రం -నల చక్రవర్తి విరచితం.లఘిమ అనే యోగా ప్రక్రియ వల్ల గాలిలో ఎగరడం/నీటి మీద నడవడం జరుగుతుంది.పూర్ణ యోగా సాధకులు ఈ విద్యలను అతి సులభంగా ప్రదర్సించగలరు.వారిని నేను చూచాను కూడా.----జయదేవ్.

  ReplyDelete
 6. @కన్నగాడు,/మీరు మీ ముత్త్హాతను చూసివుండరు, కాబట్టి ఆయనలేడని అనే పక్షంలో ఈ శాస్త్రాలు కూడా లేనట్లే.ఇక్కడ ముత్త్హాత,మీ తల్లి/తండ్రి చెప్పే విషయసూచికలని మీరనుకుంటే ఆయనకూడా హుల్లక్కేనా?మాస్టారూ./జయదేవ్.

  ReplyDelete
 7. "vutthista jaagarada praapyavaraan nibhodatha" excellent work my dear brother!

  ReplyDelete
 8. Is there anyway to see if we can find these books from anywhere? I mean in some old libraries or old peoples' houses?

  ReplyDelete
 9. @astrojoyd, బహుశా నేను సరిగా వ్యక్తీకరించలేదనుకుంటా, నా విమర్శ ఆ పుస్తకాలను భద్రపరచలేకపోయిన మా ముత్తాత మీద.

  ReplyDelete
 10. @samba/a few of them preserved in tanjore/mysore/libs.The original taalapatra versions r still available in london -indian archives dept nd in germany also sir.In 1996,while iam in london,i have seen them--jayadev,chennai-17..........

  ReplyDelete
 11. @kannaa/indulo vaari tappaemee ledu,kaakuntae meeku wooha telisaentavaraku vaatipaina abhiruchi kaligiundaka povachhunu.aa kaalam manushulu veetini jaagratthagaanae vunchutoo vachhaaru.manaki moodo vyakthi cheppaedaakaa e vishamu pattinchukokapovadam valla,biddanu chankanaesukuni wooranthaa thirugutuntaam antae./jayadev,chennai-17

  ReplyDelete
 12. Nice one. My feeling is even though the original works as penned down by Vyasa, Bhardwaja etc., may not be available, but at least a digest or part of the works might have been preserved by the later authors by re-writing them. A good example for these are currently available books on jyotish. Even though the original science is lost long ago, ramnants of the original jyotish works are preserved by different authors in many different works.

  Even if we assume that these sciences are availble to us today, do you think we have the ability to understand them and use them in a practical manner ? I doubt!!

  Knowledge cannot be preserved in books so easily, so that people 3000 years down the line can understand them.

  ReplyDelete
 13. మహేష్ గారూ!,సాంబ గారూ! అందుబాటులో ఉన్న కొన్ని పుస్తకాలు తంజావూరు గ్రంథాలయంలో ఉన్నాయి.
  జయదేవ్ గారూ! మీరు చెప్పినట్లు నీటిలో తేలడం,గాలిలో ఎగరడం పతంజలి యోగశాస్త్రం ప్రకారం నిజంగా వచ్చే సిద్దులు. కానీ మహేంద్రజాల శాస్త్రం లో పేర్కొన్నది అలా కనిపించేలా భ్రమను(mesmerize) కల్గించే గారడీ విద్యలు.అంటే అలా చేయరు కానీ భ్రమను కల్పిస్తారు.
  దుర్గేశ్వర్ గారూ, ఆమ్రపాలి గారూ, కన్నగాడు గారూ, సావిరహే గారూ అందరికీ ధన్యవాదాలు.

  ReplyDelete
 14. మంచి విషయాలు చెప్పారండీ. చదివే శక్తి, ఆసక్తి లేకపోవడం వల్ల ఆ విషయాలు ఇప్పటి వారమైన మనకు తెలియటలేదు.
  శ్రీవాసుకి

  ReplyDelete
 15. Really Great Post.. ee books ni ventane chadavalanipistondi.. Thank you Suresh

  ReplyDelete
 16. రాగిని బంగారంగా మార్చడం:

  కూలంకషంగా వుంది అన్నారు. దయచేసి వివరాలు తెలుగులో ఇవ్వండి. ఓ కిలో బంగారం చేయడానికి ఎంత రాగి పడుతుందంటారు? ఒక్క రాగి తో మాత్రమే బంగారు చేయగలమా?
  చాలా అవసరంగా వుంది, దయచేసి నాకీవిద్య ప్రసాదించండి, మీ రుణం ఈజన్మలోనే తీర్చుకుంటాను.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు