తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, July 21, 2010

గార్గి - స్త్రీ జాతిలో ఒక ఆణిముత్యం

గార్గి వేదకాలం నాటి మహాయోగిని.ఈమె బ్రహ్మజ్ఞానం పొందిన సాధ్వి.ఈమె సకల వేదాలు,శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞానిగా పేరు పొందినది.ఆ కాలంలోని మహా జ్ఞానులలో ఈమె ఒకరు.

ఈమె వచక్నుడు అనే మహాముని యొక్క కుమార్తె.చిన్నప్పటి నుండే గార్గి యొక్క విద్యాభిలాష ప్రస్ఫుటంగా కనిపించేది.ఈమె బ్రహ్మచారిని.పరబ్రహ్మం యొక్క ఉనికిని అన్వేషిస్తూ ఈమె అనేక సూక్తాలను రచించింది.జనక మహారాజు యొక్క సభలోని నవరత్నాలలో ఈమె కూడా ఒకరు.ఈమె యొక్క పేరు జనకమహారాజు నిర్వహించిన బ్రహ్మజ్ఞానుల సభ ద్వారా వ్యాప్తి చెందినది.ఆ సభలో ఆ కాలంలో అందరికన్నా గొప్పవాడైన "యాజ్ఞవల్క్య ముని"ని ఆత్మ,పరమకారణమైన పరమాత్మ ల గురించి గార్గి వేసిన ప్రశ్నలు అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.

ఉపనిషత్తులలో గార్గి యొక్క ప్రస్తావన వస్తుంది. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్నవల్క్యముని తో సంభాషణలలో ఈమె జ్ఞానపు వెలుగులు మనలను,అందరిని నిశ్చేష్టులను చేస్తాయి. ఉపనిషత్తులలో ఆమెను ఒక గొప్ప సహజ వేదాంతజ్ఞాని గా పేర్కొన్నారు.

మహాతల్లి గార్గి వేదకాలం నాటిదైనందున
ఇంతకన్నా ఎక్కువ వివరాలు దొరకడం లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

9 comments:

 1. @సురేష్ గారు,

  రెండు సంవత్సరాల క్రితం అనుకు౦తా, కేరళలో ఒక చర్చ్ ఫాదర్ గార్గి అమ్మ పేరు మీద తిరుచ్చి లో {గార్గి మహిళా చిత్రోత్సవాలు } నిర్వహించాడు.. అప్పడు తెలిసింది నాకు గార్గి అమ్మ అంటే ఎవరో.. ఇంకా చిత్ర౦గా, ఆ ఫాదర్ ఆమె పా౦డిత్యపు గొప్పతనాన్ని మరియు ఆమెను ఒక మహిళా శక్తిగా మహిళలు ఎలా ఆదర్శ౦గా తీసుకోవచ్చు అని చెప్పారు.. /సమయ౦ వచ్చింది కాబట్టి చేబుత్తునా /..నాకు తెలీదు ఇవన్నీ, అప్పుడు తెలిసిందల్లా ఏ కంప్యూటర్ కోర్స్ చేయాలి ... ఏది చేస్తే బాగా శాలరీ వస్తది..
  మనవాలు చేసిన్దేముద్ది బొగ్గు.. అంతా విదేశీయులు చేసిందే అనుకునేవాడిని.. అవును మరి మొకాలే మానస పుత్రులలో నేను ఒకడిని కదా అప్పుడు.. .. ఆ తరవాత ఇదిగో మీలాంటి వాళ్ళ టపాలు చదివి అందులోని నిజాన్ని/అనుమానాల్ని నాకు నీనే ప్రశ్నలుగా సంధిచికొని , వాటికి సంభదించిన పుస్తకాలు చదివి( ఇంకో విచిత్రం... ఇందులో చాలా వరకు విదేశీయులు వ్రాసినవే కాకపోతే మన శాస్త్రాల మీది ముక్కువతో/లేదా వారి స్వలాభ౦ కోసం) ఇంకా అనుమానులు౦టే మీలాంటివాళ్ళతో మాట్లాడి నివృత్తి చేసుకుటున్నా ఇప్పుడు..
  ఈ రోజు ఉదయాన్నే గార్గి గారి గురించి మళ్ళీ మీ టపాలో చూసి ఆనంద౦పొందా.

  ReplyDelete
 2. వేదాలూ, ఉపనిషత్తులూ మొదలైనవాటిని, మీదగ్గర ముద్రిత గ్రంథాలుంటే వాటినీ, తాళ పత్రాలుంటే వాటినీ, స్కాన్ చేసి, పీడీఎఫ్ నో ఇంకేదో ఫార్మేట్ లోనో ప్రచురిస్తే, వాటిని చదువుకుంటూ, మీ వ్యాఖ్యానాలని చదువుకుంటాము కదా?

  దయచేసి ఆ పని చెయ్యండి.

  ReplyDelete
 3. అందరికి ధన్యవాదాలండి.
  @కృష్ణశ్రీ గారు!
  నావద్ద సొంతంగా కంప్యూటర్ కాని,laptop గాని లేవండి. నా స్నేహితుడి కంప్యూటర్ లో notepad పై టైపు చేసుకొని ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్లి బ్లాగు పోస్టు చేయడం గాని లేకుంటే నా సెల్ నుండి మా స్నేహితుడి కంప్యూటర్ కు నెట్ కనెక్ట్ చేసి బ్లాగు వ్రాస్తుంటాను. సెల్ నుండి నెట్ కనెక్షన్ అంటే చాలా నెమ్మదిగా ఉంటుంది. నా వద్ద తాళపత్రాలు ఏవి లేవండి. రామకృష్ణ మఠం వారి ఉపనిషత్ పుస్తకాలు మాత్రం ఉన్నాయి.
  కాని మీరు చెప్పినది తప్పకుండా ప్రయత్నిస్తానండి.

  ReplyDelete
 4. చాలా సంతోషం!

  చాలా శ్రమతీసుకొని, చక్కగా వ్రాస్తున్నారు.

  ఓ లేప్ టాప్ కొనుక్కున్నాక అయినా, మా కోరిక తీరుస్తారని ఆశ.

  కీపిటప్.

  ReplyDelete
 5. @సురేష్ గారు,
  మీరు నిజ్జగా చాలా కష్టపడుతున్నారు... హ్మం..నేను ఏమైనా మీకు సాయం చేయగలనా !!!....

  ReplyDelete
 6. @Rajesh G గారు!
  అవసరం ఐనప్పుడు ఖచ్చితంగా మీ సహాయం అడుగుతానండి. చాలా కృతజ్ఞతలండి మీకు. అయినా కష్టం ఏమి లేదండి.ఇష్టమైన పనే చేస్తున్నాను.

  ReplyDelete
 7. వేదాలు చదవాలి అంటే -- సమాచారము ఎక్కడ దొరుకుతుంది అనగా పుస్తకాలు...

  ReplyDelete
 8. నాకు వేదాలు చదవాలని చాలా కోరిక

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు